ETV Bharat / science-and-technology

లక్షలాది 'స్మార్ట్​' పరికరాలకు హ్యాకింగ్​ ముప్పు - హ్యాకింగ్​

సాఫ్ట్​వేర్​లలో లోపాల వల్ల మిలియన్ల స్మార్ట్​ పరికరాలు హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది అమెరికా సైబర్​ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరించారు. ఈ కనెక్టడ్ డివైజెస్​తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.​

Research: Millions of smart devices vulnerable to hacking
మిలియన్లలో స్మార్ట్​ పరికరాలకు హ్యాకింగ్​ ముప్పు
author img

By

Published : Dec 8, 2020, 4:22 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

మిలియన్ల సంఖ్యలో స్మార్ట్​ పరికరాలకు హ్యాకింగ్​ ప్రమాదం పొంచి ఉందని అమెరికాకు చెందిన సైబర్​ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వాటి సాఫ్ట్​వేర్​లో లోపాలు గుర్తించినట్టు పేర్కొంది. ఈ లోపాలను వాడుకుని.. వ్యాపార, ఇంటి కంప్యూటర్​ నెట్​వర్క్​లను హ్యాక్​ చేసే అవకాశముందని హెచ్చరించింది. అయితే ఇప్పటివరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదని తెలిపింది.

ఇంటర్నెట్​ అనుసంధాన పరికరాల్లోని డేటా-కమ్యూనికేషన్​ సాఫ్ట్​వైర్స్​లో ఈ ముప్పు ఉందని.. దీనిని వెంటనే పరిష్కరించాలని సైబర్​ సెక్యూరిటీస్​ సంస్థ ఫోర్​స్కౌట్​ టెక్నాలజీస్​ పరిశోధకులు వెల్లడించారు. స్మార్ట్​ థర్మామీటర్లు, స్మార్ట్​ ప్లగ్స్​, ప్రింటర్ల నుంచి ఆఫీసుల్లోని రూటర్ల వరకు, హెల్త్​కేర్​ అప్లయెన్సెస్​ నుంచి పరిశ్రమల నియంత్రణ వ్యవస్థ వరకు అన్నింటిలోనూ ఈ లోపాలున్నాయని వారు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు.

హ్యాకింగ్​ బెడద నుంచి రక్షణాత్మక చర్యలు చేపట్టాలని వినియోగదారులకు పరిశోధకులు సూచించారు. పరిశ్రమల నియంత్రణ వ్యవస్థను అంతర్జాలం నుంచి పూర్తిగా వేరుచేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:- కొవిడ్​ తరువాత సాధారణ స్థితికి వుహాన్​!

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.