ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం వినియోగించే క్రోమ్ సెర్చ్ ఇంజన్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌కి సంబంధించి గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. క్రోమ్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌కు లాక్ వేసుకునే సౌలభ్యాన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌లోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా డివైజ్ యూజర్స్ సేఫ్ బ్రౌజింగ్ చేయడానికే ప్రాధాన్యమిస్తారు. అందులో భాగంగా అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది క్రోమ్ సెర్చ్ ఇంజన్లో ఉండే ఇన్‌కాగ్నిటో మోడ్. ఎందుకంటే ఈ మోడ్‌లో మనకి కావాల్సిన కంటెంట్ ఎంత వెతుక్కున్నా ఇందులో సేవ్ అవ్వదనే ఉద్దేశంతో ఉంటారు. కానీ నిజానికి ప్రైవేట్ బ్రౌజింగ్ కోసమని దీనిని ఆశ్రయించే వాళ్లు గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో కూడా మనం అన్వేషించే ప్రతీ అంశం నిక్షిప్తమై ఉంటుందనే వాస్తవం. బహుశా ఈ విషయం సాంకేతిక నిపుణులకు తప్ప సాధారణ యూజర్స్‌కి తెలియకపోవచ్చు. అయితే మనం ఏ టాపిక్ వెతికినా ఇతరులు మన మొబైల్ తీసుకున్నప్పుడు మనం చూసిన వెబ్‌సైట్స్ వివరాలు వారి కంట పడకూడదనే అనుకుంటాము. ఏదేమైనా ఇన్‌కాగ్నిటో మోడ్ మన బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే దీనికి లాక్ వేసుకునే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది టెక్ దిగ్గజం గూగుల్.
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఉండే క్రోమ్ ఇన్‌కాగ్నిటో మోడ్‌ను లాక్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ రూపొందించింది. కాగా ఈ సౌకర్యం అంతకుముందు కేవలం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా, ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం వినియోగించే క్రోమ్ సెర్చ్ ఇంజన్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌కి సంబంధించి ప్రస్తుతం గూగుల్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం పట్ల యూజర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ మోడ్‌ను ఎలా లాక్ చేసుకోవాలి..?
- వినియోగదారులు తమ డివైజ్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతుల్లో ఈ ప్రైవేట్ బ్రౌజర్లోని ట్యాబ్‌లను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు.
- ఇకపోతే ఈ ఫీచర్ ఇంకా అన్ని డివైజ్‌లలో అందుబాటులోకి రాలేదు.
అయితే ఇంతకుముందు 2021 నుంచి ఈ సౌకర్యం కేవలం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన డివైజ్‌లలో మాత్రమే పనిచేసేది. కాగా సంస్థ తాజా నిర్ణయంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ ఫీచర్‌ను ఆస్వాదించే అవకాశం యూజర్స్‌కి లభిస్తోంది.
అయితే కింద వివరించిన స్టెప్స్‌ను అనుసరిస్తే ఇన్‌కాగ్నిటో మోడ్‌ను సులువుగా లాక్ చేయెచ్చు..!
- ముందుగా మీరు డివైజ్‌లోని క్రోమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి.
- తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం లాక్ ఇన్‌కాగ్నిటో ట్యాబ్స్ అనే నీలం రంగు బటన్‌పై నొక్కి ఎనేబుల్ చేసుకోవాలి.
అంతే దీంతో మీ వ్యక్తిగత గోప్యతకు తాళం వేసినట్లే.
ఒకసారి ఇలా చెక్ చేసి చూడండి..!
ఈ ఫీచర్‌ను చెక్ చేయడానికి ముందుగా మీరు క్రోమ్‌ను క్లోజ్ చేయండి. అనంతరం దాన్ని ఓపెన్ చేసినప్పుడు అన్‌లాక్ చేయమని స్క్రీన్‌పై ఓ తెర కనిపిస్తుంది. అది మనం లాక్ చేసే సమయంలో పెట్టుకునే నంబర్ లాక్, ప్యాటర్న్ లాక్ లేదా ఫింగర్‌ప్రింట్ ఏదైనా కావచ్చు.
ఇకపోతే ఈ ఇన్‌కాగ్నిటో మోడ్ మినహా మిగతా సెర్చ్ బ్రౌజర్స్ అన్నీ పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా యాక్సెస్ చేయెచ్చు. అయితే ప్రస్తుతం గూగుల్ తెచ్చిన ఈ ఫీచర్ ఓ హ్యండీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మీ ఫోన్‌ను వేరొకరికి ఇచ్చే సందర్భంలో మీరు ఏ వెబ్‌సైట్స్‌ని వీక్షించారో వారికి తెలియకుండా ఉండాలి అనే సమయంలో ఈ ఫీచర్ మనకు సహాయపడుతుంది. మీరు దీన్ని మీ ఫోన్లో ప్రయత్నించినా విజయవంతం కాకపోతే ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులోకి వచ్చే ప్రక్రియ జరుగుతోందని గూగుల్ నుంచి ఓ సందేశం వస్తుంది.