Google Bard AI Features : గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'గూగుల్ బార్డ్ ఏఐ' ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 180 దేశాల్లో దీనిని ప్రవేశపెట్టింది గూగుల్.
"మేము గూగుల్ బార్డ్‌ను 180 దేశాల్లో అందుబాటులోకి తెచ్చాం. అందులో భాగంగా భారతదేశంలోనూ దీనిని ప్రవేశపెట్టాం. ఈ సరికొత్త ఏఐ బార్డ్‌లో మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకువస్తాం. దీనిని ప్రజలు అందరూ ఉపయోగించి, తమ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను మాకు అందిస్తారని ఆశిస్తున్నాం."
- గూగుల్
గూగుల్ బార్డ్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
ముందుగా మీరు bard.google.com కు వెళ్లాలి. 'ప్రస్తుతం ఈ చాట్‌బాట్ టెస్టింగ్ దశలోనే ఉంది.' అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది. మీరు 'ట్రై బార్డ్'పై క్లిక్ చేయాలి. తరువాత కంపెనీ ప్రైవసీ పాలసీపై క్లిక్ చేసి దానిని యాక్సెప్ట్ చేయాలి. అంతే మీరు బార్డ్ ఏఐని ఉపయోగించుకోవచ్చు.
ప్రయోగదశలోనే ఉంది!
ప్రస్తుతం బార్డ్ ఏఐ అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అందుకే గూగుల్ బార్డ్ మీకు చూపించే సమాచారం.. కొంత మేరకు అసంబద్ధంగా లేదా అభ్యంతరకరంగా ఉండొచ్చు.
అనేక భాషలను సపోర్ట్ చేస్తుంది!
గూగుల్ బార్డ్ ప్రస్తుతం ఆంగ్లంతోపాటు జపనీస్, కొరియన్ భాషలను సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే మరో 40 భాషల్లోకి ఈ ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ సమాయత్తమవుతోంది.
గూగుల్ బార్డ్ - అప్‌కమింగ్ ఫీచర్స్
గూగుల్ తన సరికొత్త ఏఐ బార్డ్‌లో.. టెక్ట్స్‌తో పాటు విజువల్ అంటే చిత్రాల రూపంలో సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
- ఉదాహరణకు మీరు తాజ్‌మహల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు బార్డ్ ఏఐ.. తాజ్‌మహల్ గురించి అక్షర రూపంలోని సమాచారంతోపాటు..తాజ్‌మహల్ చిత్రాలను కూడా మీకు అందిస్తుంది. దీని వలన మీరు ఏ విషయం గురించి వెదుకుతున్నారో.. దాని గురించి మరింత స్పష్టమైన సమాచారం మీకు అందుతుంది అని గూగుల్ తెలిపింది.
యూజర్లు కూడా తమ దగ్గర ఉన్న ఇమేజ్‌లను ఉపయోగించి, బార్డ్ చాట్బాట్లో సెర్చ్ చేయవచ్చు. దాని కోసం మీరు మీ గూగుల్ లెన్స్‌ను బార్డ్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
- ఉదాహరణకు మీ దగ్గర రెండు కుక్కల చిత్రాలు ఉన్నాయి. వాటిని గూగుల్ బార్డ్ సెర్చ్‌లో ఉంచి, మంచి హాస్యభరితమైన క్యాప్షన్‌ను సూచించాలని కోరవచ్చు. అప్పుడు బార్డ్ ఏఐ.. ఆ చిత్రాలను విశ్లేషించి, అవి ఏ జాతి కుక్కలో కూడా తెలుసుకుని, వాటికి తగినట్లుగా మంచి క్యాప్షన్‌ను ఇస్తుంది. అది కూడా కేవలం కొన్ని సెకెన్లలోనే.
-
Bard is an experimental conversational AI service, powered by LaMDA. Built using our large language models and drawing on information from the web, it" s="" a="" launchpad="" for="" curiosity="" and="" can="" help="" simplify="" complex="" topics="" →="" https://t.co/fSp531xKy3 pic.twitter.com/JecHXVmt8l
— Google (@Google) February 6, 2023 ' class='align-text-top noRightClick twitterSection' data=' '>
-
గూగుల్ ప్రొడక్టులతో బార్డ్ అనుసంధానం!
ఇప్పటికే గూగుల్ తన బార్డ్ ఏఐని డాక్స్, డ్రైవ్, జీమెయిల్, మ్యాప్స్‌తో సహా అన్ని గూగుల్ ప్రొడక్టులకు అనుసంధానం చేసింది. దీనితోపాటు అడోబ్ ఫైర్ఫ్లైతో కూడా బార్డ్‌ను అనుసంధానం చేసి, మంచి చిత్రాలను జనరేట్ చేయవచ్చు. అయితే బార్డ్‌ను ఉపయోగించడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదని గూగుల్ చెబుతోంది.
ప్రస్తుతం అంతర్జాలంలో ఉన్న అన్ని సేవలను కూడా బార్డ్ మీకు అందించగలదు. అలాగే ఎక్స్టెన్షన్లను కూడా దీనికి మీరు అనుసంధానం చేసుకోచ్చు. దీని వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత సృజనాత్మకమైన సేవలు మీరు పొందవచ్చు అని గూగుల్ చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: