మెటావర్స్(facebook new name).. మనం భవిష్యత్తులో అడుగుపెట్టబోయే వర్చువల్ ప్రపంచం. సరికొత్త సాంకేతిక యుగానికి నాంది. మనం ఉన్నచోటు నుంచే ప్రపంచాన్ని చుట్టి రావచ్చనే ఉహాకందని ఆలోచనకు ప్రతిరూపం. ఈ వర్చువల్ ప్రపంచంతో మనిషి జీవిన విధానమే మారబోతుందని ముందే పసిగట్టిన మార్క్ జుకర్ బర్గ్.. తమ మాతృసంస్థ పేరును 'మెటావర్స్'(facebook name change) మార్చుతున్నట్లు ప్రకటించారు. అసలు మెటావర్స్ అంటే ఏమిటి?(metaverse facebook) భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం
మెటావర్స్ అంటే ఏమిటి?
మెటావర్స్ అంటే కంప్యూటర్ ద్వారా సృష్టించే వర్చువల్ ప్రపంచం(facebook name change meta). ఈ సాంకేతికత ద్వారా మనిషి ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తితోనైనా ఇంటరాక్ట్ కావచ్చు. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్‌గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. వర్చువల్ షాపింగ్లూ చేసుకోవచ్చు. మెటావర్స్ అన్న పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల 'స్నో క్రాష్'లో దీని గురించి ప్రస్తావించారు.
మెటావర్స్ లోగో ఎలా ఉంది?
మోటావర్స్ లోగో(metaverse logo facebook) చూడటానికి ఇన్ఫినిటీ గుర్తును పోలి ఉంటుంది. మెలికలు తిరిగి ఉండే జర్మనీ, ఇటలీ ప్రసిద్ధ బేకరీ వంటకం ప్రెట్జెల్లా కన్పిస్తుంది. 'అవధుల్లేని ప్రపంచం' అని అంతరార్థం వచ్చేలా ఈ లోగోను డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.
ఫేస్‌బుక్, వాట్సాప్ పేర్లు మారతాయా?
తమ మాతృ సంస్థ 'పేస్బుక్ ఐఎన్‌సీ' పేరు 'మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ఐఎన్‌సీ'గా(facebook new name) మారుతుందని జుకర్‌బర్గ్ తెలిపారు. సింపుల్‌గా దీన్ని మెటా అని పిలవచ్చు. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి స్టాక్ మార్కెట్లో మాత్రం 'ఎంవీఆర్ఎస్' పేరుతో ట్రేడింగ్ ఉంటుందని వెల్లడించారు.
మెటావర్స్ ఎలా ఉంటుంది?
మెటావర్స్(metaverse facebook) ఎలా ఉండబోతుందో వీడియో డెమో ద్వారా వివరించారు జుకర్‌బర్గ్. అవతార్ రూపంలో ఉన్న వ్యక్తులు డిజిటల్ వెర్షన్‌గా మారి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం, కాలచక్రంలోని ప్రవేశించి పాత యుగంలోకి ప్రయాణించడాన్ని చూపించారు.
వ్యక్తిగత గోప్యత భద్రమేనా?
ఇప్పటికే.. యాడ్ల కోసం వ్యక్తిగత డేటాను విక్రయిస్తోందన్న ఆరోపణలు ఫేస్‌బుక్‌పై ఉన్నాయి. మెటావర్స్‌లో(metaverse news) వ్యక్తిగత గోప్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని జుకర్‌బర్గ్ హామీ ఇచ్చారు. పేరెంటల్ కంట్రోల్, డేటా వినియోగానికి సంబంధించిన పకడ్బందీగా ఉంటామన్నారు. సామాజిక మాధ్యమ వ్యూహంలో యాడ్స్(ప్రకటనలు) కీలక భాగంగా ఉన్నాయని, మెటావర్స్‌లోనూ అది కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మెటావర్స్‌లో మనం ఏం పనులు చేయొచ్చు?
మెటావర్స్‌లో(metaverse facebook) వర్చువల్ కాన్సర్ట్‌లు, ఆన్లైన్ పర్యటనలు చేపట్టవచ్చు. అంతర్జాలంలోనే దుస్తులు ధరించి మనకు సరిపోయే సైజులను గుర్తించవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ విషయంలో విప్లవాత్మకంగా నిలవనుందీ మెటావర్స్. వీడియో కాల్స్‌లోనే సహోద్యోగులతో చూడటానికి బదులుగా.. వర్చువల్ వాతావరణంలో కలిసి పనిచేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇప్పటికే కంపెనీల కోసం హొరైజాన్ వర్క్రూం సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసింది. ఈ సంస్థే తయారు చేసిన 'ఆక్యులస్ వీఆర్' హెడ్సెట్లను ధరించి ఈ వర్క్రూంలలో పని చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Facebook New Name: 'ఫేస్‌బుక్' పేరు మారింది.. ఇక నుంచి 'మెటా'గా..