ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో 'Hi' చెబితే చాలు.. క్షణాల్లో లోన్​ వచ్చేస్తుంది.. ఎలా అంటే? - వాట్సాప్​ కొత్త ఫీచర్​

Loan on Whatsapp: ఇక వాట్సాప్‌లో 'Hi' అంటే చాలు క్షణాల్లో లోన్ వచ్చేస్తుంది.. అవనండీ మీరు చదివింది నిజమే!. ముంబయికి చెందిన ఫిన్​టెక్​ సంస్ధ క్యాష్​ఈ (CASHe).. కేవలం వాట్సాప్​లో హాయ్​ చెబితే ఎటువంటి మొబైల్​ యాప్​ డౌన్​లోడ్​ చేయకుండా రుణం కల్పిస్తామని చెబుతుంది. ఇంతకీ ఆ ప్రాసెస్​ ఏంటో చూడండి..

Loan on Whatsapp
Loan on Whatsapp
author img

By

Published : Jun 16, 2022, 7:45 AM IST

Loan on Whatsapp: లోన్‌ కావాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంక్‌ యాప్‌లోకి లాగిన్‌ అయ్యి కొన్ని వివరాలు నమోదుచేస్తే చాలు క్షణాల్లో రుణ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రయాస కూడా అవసరం లేదంటోంది ముంబయికి చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ క్యాష్‌ఈ (CASHe). కేవలం వాట్సాప్‌లో హాయ్‌ (Hi) అని చెబితే చాలంటోంది. ఎటువంటి మొబైల్‌ అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేయకుండా.. ఎలాంటి డాక్యుమెంట్లు పూర్తి చేయకుండానే రుణ సదుపాయం కల్పిస్తామని చెబుతోంది. కృత్రిమ మేధ సదుపాయంతో అందిస్తున్న ఈ సౌకర్యాన్ని తొలిసారి తామే ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఈ పేర్కొంది.

ఇన్‌స్టంట్‌ క్రెడిట్‌ లైన్‌ పొందేందుకు క్యాష్‌ఈ సంస్థ ఓ వాట్సాప్‌ నంబర్‌ను ప్రత్యేకించింది. 80975 53191 అనే నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ పెడితే చాలు వెంటనే చాట్‌ బాట్‌ నుంచి మీకు సందేశం వస్తుంది. మీరు అందించే వివరాలను సరిపోల్చుకుని కొన్ని క్లిక్కుల్లోనే రుణం మొత్తాన్ని అందిస్తుంది. అయితే, కేవలం వేతన జీవులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

నేటి స్మార్ట్‌ వినియోగదారులు కాంటాక్ట్‌ లెస్‌ సపోర్ట్‌ కోరుకుంటున్నారని, ఆ దిశగా తాము ఈ వాట్సాప్‌ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు వి.రమణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ తరహా సేవలను అందిస్తున్న తొలి కంపెనీ తమదేనని వివరించారు. వాట్సాప్‌లో భారీ సంఖ్యలో ఉన్న వినియోగదారులను తమ ఈ సేవల ద్వారా చేరువ అవ్వాలనుకుంటున్నట్లు వివరించారు. 2016లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి సుమారు రూ.2వేల కోట్ల మేర రుణాలు అందించినట్లు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి: మీ పాస్​వర్డ్​ సేఫేనా? హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండిలా..!​

16 కొత్త ఫీచర్లతో ఐఓఎస్​ అప్​డేట్​.. యూజర్లకు పండగే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.