ETV Bharat / science-and-technology

మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? మార్కెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 4:08 PM IST

Best Smartwatches In December 2023 In Telugu : మీరు మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బెస్ట్ స్మార్ట్​వాచ్​ను ఎలా ఎంచుకోవాలి? అనే విషయంతోపాటు.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-10 స్మార్ట్​వాచ్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how to choose best branded smartwatch
Best Smartwatches In December 2023

Best Smartwatches In December 2023 : నేటి యువత ఫ్యాషన్ యాక్సెసరీస్​ వాడడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంప్రదాయ చేతిగడియారాల కంటే స్మార్ట్​వాచ్​లు ధరించడానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అన్నీ యువతను ఆకట్టుకునేందుకు.. మంచి డిజైన్​తో, సూపర్ ఫీచర్స్, స్పెక్స్​తో సరికొత్త స్మార్ట్​వాచ్​లను మార్కెట్లోకి తెస్తున్నాయి.

బెస్ట్ స్మార్ట్​వాచ్​ను ఎంచుకోవడం ఎలా?
ప్రస్తుతం మార్కెట్లో చెప్పలేనన్ని బ్రాండెడ్ స్మార్ట్​వాచ్​లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్​ స్మార్ట్​వాచ్​ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  1. బ్యాటరీ లైఫ్​ : స్మార్ట్​వాచ్​ బ్యాటరీ లైఫ్​ కాస్త ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం చాలా బ్రాండ్​లు కనీసం 5-10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉండే వాచ్​లను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న స్మార్ట్​వాచ్​ను ఎంచుకోవాలి.
  2. స్క్రీన్​ సైజ్​ : నేడు చాలా స్మార్ట్​ఫోన్లు అధునాత ఫీచర్లతో వస్తున్నాయి. వాటిని సరిగ్గా వాడుకోవాలంటే.. స్క్రీన్ సైజ్ కాస్త పెద్దగా ఉండే స్మార్ట్​వాచ్​ను ఎంచుకోవడం మంచిది.
  3. కాలింగ్ ఫీచర్​ : కొన్ని స్మార్ట్​వాచ్​లు కాలింగ్ ఫీచర్​తో వస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక కాలింగ్ ఫీచర్​ ఉన్న స్మార్ట్​వాచ్​నే ఎంచుకోవడం మంచిది.
  4. హెల్త్​ ట్రాకింగ్ ఫీచర్స్​​ : నేడు చాలా స్మార్ట్​ఫోన్లలో హెల్త్​ ట్రాకింగ్ ఫీచర్స్, స్పోర్ట్స్ ఫీచర్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఈసీజీ ట్రాకర్ లాంటి ఫీచర్లు మీ ఆరోగ్య సమాచారాన్ని అందిస్తాయి. స్పోర్ట్ ఫీచర్లు.. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఖర్చు చేస్తున్న క్యాలరీల గురించి సమాచారమిస్తాయి. కనుక ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్​వాచ్​ను ఎంచుకోవాలి.
  5. డిజైన్​ : మంచి ఆకర్షణీయంగా, మీ అభిరుచికి అనుగుణంగా సూపర్​ డిజైన్​తో​ ఉన్న స్మార్ట్​వాచ్​ను ఎంచుకోవాలి.

Best Smartwatchs In December 2023 : పైన పేర్కొన్న అన్ని మంచి క్వాలిటీలు ఉన్న టాప్​-10​ స్మార్ట్​వాచ్​లపై ఓ లుక్కేద్దాం.

1. Amazfit GTS 4 Mini Smart Watch Features : అమేజ్​ఫిట్ జీటీఎస్​ వాచ్​.. 5 శాటిలైట్​ పొజిషనింగ్ సిస్టమ్స్​ను సపోర్ట్ చేస్తుంది. కనుక మీ మూమెంట్స్​ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. దీని బాడీ చాలా స్ట్రాంగ్​గా, చూడడానికి మంచి స్టైలిష్​గా ఉంటుంది.

Amazfit GTS 4 Mini Smart Watch Price : మార్కెట్లో ఈ అమేజ్​ఫిట్​ జీటీఎస్​​ 4 మినీ స్మార్ట్​వాచ్ ధర సుమారుగా రూ.7,999 వరకు ఉంటుంది.

Amazfit GTS 4 Mini Smart Watch
అమెజ్​ఫిట్​ జీటీఎస్​ 4 మినీ

2. Fossil Gen 6 Smartwatch Features : ఈ స్మార్ట్​వాచ్​లో 24 అవర్​ ప్లస్​ మల్టీ-డే అనే డైనమిక్ ఫీచర్ ఉంది. ఇది యూఎస్​బీ డేటా కేబుల్​తో వస్తుంది. దీనిలో అనేక స్మార్ట్​వాచ్​ ఫేసెస్​ ఉంటాయి. కనుక మీకు నచ్చినట్లుగా ఈ స్మార్ట్​వాచ్​ లుక్​ను మార్చుకోవచ్చు. అంతేకాదు.. దీనిలో ఫిట్​నెస్​, పేమెంట్స్, సోషల్, న్యూస్​ యాప్స్​ లాంటివి ఎన్నో ఉన్నాయి.

Fossil Gen 6 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫాసిల్ జెన్ 6 స్మార్ట్​వాచ్​ ధర సుమారుగా రూ.12,497 ఉంటుంది.

Fossil Gen 6 Smartwatch
ఫాసిల్​ జెన్​ 6

3. Fastrack New Limitless FS1 Smartwatch Features : ఇండియాలో మోస్ట్​ ట్రస్టెడ్​ బ్రాండ్స్​లో ఫాస్ట్రాక్​ ఒకటి. దీనిలో వాటర్​ఫ్రూఫ్ మెకానిజం ఉంది. కనుక నీటిలోనూ దీనిని వాడవచ్చు. దీనిలో నెక్ట్స్​ జెన్ ఏటీఎస్ చిప్​సెట్ అమర్చారు. ఈ స్మార్ట్​వాచ్​లో బిల్ట్​-ఇన్​ అలెక్సా ఉంది. దీని ద్వారా మ్యూజిక్​ను కూడా కంట్రోల్ చేయవచ్చు. దీనిలో బోలెడ్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

Fastrack New Limitless FS1 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫాస్ట్రాక్​ స్మార్ట్​వాచ్ ధర సుమారుగా రూ.1,999 ఉంటుంది.

Fastrack New Limitless FS1 Smartwatch
ఫాస్ట్రాక్​ స్మార్ట్​వాచ్​

4. Boat Wave Proc47 Smartwatch Features : 1.69 అంగుళాల స్క్రీన్​, స్క్వేర్​ డయిల్​ సహా మంచి టచ్​ ఎక్స్​పీరియన్స్ ఇచ్చే స్మార్ట్​వాచ్​ ఇది. ఈ బోట్​ స్మార్ట్​వాచ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది. ఇది స్లీక్ మెటాలిక్​ డిజైన్​తో, మల్టిపుల్ థీమ్​ వాచ్​ ఫేసెస్​తో వస్తుంది.

Boat Wave Proc47 Smartwatch Price : మార్కెట్లో ఈ బోట్​ స్మార్ట్​వాచ్​ ధర సుమారుగా రూ.3,509 ఉంటుంది.

Boat Wave Pro 47 Smartwatch
బోట్​ వేవ్​ ప్రో 47

5. Honor Watch GS 3 Smartwatch Features : హానర్​ వాచ్​ జీఎస్​ 3 పురుషులతోపాటు, మహిళలకు కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి స్టైలిష్​, స్లీక్ డిజైన్​తో వస్తుంది. దీని ద్వారా మీ బ్లడ్​లోని ఆక్సిజన్ లెవెల్స్​ను తెలుసుకోవచ్చు. అలాగే స్లీప్​ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​వాచ్​ను కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్​ చేయవచ్చు.

Honor Watch GS 3 Smartwatch Price : మార్కెట్లో ఈ హానర్ స్మార్ట్​వాచ్​ ధర సుమారుగా రూ.16,990 ఉంటుంది.

Honor Watch GS 3 Smartwatch
హానర్ స్మార్ట్​వాచ్​

6. Samsung Galaxy Watch 4 Features : శాంసంగ్ స్మార్ట్​ఫోన్లతో ఈ స్మార్ట్​వాచ్​ను చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో మహిళల ఆరోగ్యాన్ని అనాలసిస్​ చేసే ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 90 వర్కౌట్​ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీనిలోని బ్యాటరీని ఫుల్ రీఛార్జ్​ చేస్తే.. 40 గంటల పాటు పనిచేస్తుంది.

Samsung Galaxy Watch 4 Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్​వాచ్​ 4 ధర సుమారుగా రూ.11,999 వరకు ఉంటుంది.

Samsung Galaxy Watch 4
శాంసంగ్ గెలాక్సీ వాచ్​ 4

7. Fire Boltt Ninja Call Pro Smartwatch Features : మ్యూజిక్ లవర్స్​కు ఈ ఫైర్​ బోల్ట్ నింజా స్మార్ట్​ఫోన్ చాలా బాగుంటుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ 5 రోజులు. ఈ ఫైర్​ బోల్ట్​ స్మార్ట్​వాచ్​.. ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​, ఫేస్​బుక్​ లాంటి యాప్స్​ను సపోర్ట్ చేస్తుంది. పైగా దీనిలో హార్ట్​ రేట్​​, స్లీప్ ట్రాకింగ్​ లాంటి ఎన్నో హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.

Fire Boltt Ninja Call Pro Smartwatch Price : మార్కెట్లో ఈ ఫైర్​ బోల్ట్​ నింజా స్మార్ట్​ఫోన్ ధర సుమారుగా రూ.1,099 ఉంటుంది.

Fire Boltt Ninja Call Pro Smartwatch
ఫైర్​ బోల్ట్​ నింజా కాల్​ ప్రో

8. Apple Watch SE 2nd Gen Samartwatch Features : యాపిల్ లవర్స్ అందరికీ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వాటర్​ప్రూఫ్​ ఉన్న స్మార్ట్​వాచ్​. దీనిలో డైనమిక్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. దీని సైజ్​, కలర్​, స్ట్రాప్స్ అన్నింటినీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది హార్ట్​ రిథమ్​ను కూడా అనలేజ్​ చేసి యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్​వాచ్​తో.. మిగిలిన యాపిల్ ప్రొడక్టులను కూడా ట్రాక్​ చేసుకోవచ్చు. అయితే ఇది ఐఫోన్ 8, దాని తరువాతి లేటెస్ట్​ వెర్షన్​లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

Apple Watch SE 2nd Gen Samartwatch Price : మార్కెట్లో ఈ యాపిల్ స్మార్ట్​వాచ్​ ధర రూ.29,999 ఉంటుంది.

Apple Watch SE 2nd Gen Samartwatch
యాపిల్ వాచ్​

9. Fire Boltt Ninja Call Pro Max 2.01 Smartwatch Features : ఈ ఫైర్ బోల్ట్​ నింజా స్మార్ట్​ఫోన్​లో కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సహా​, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. పైగా దీనితో మీ స్మార్ట్​ఫోన్​లోని మ్యూజిక్​ను కంట్రోల్ చేసుకోవచ్చు. ​

Fire Boltt Ninja Call Pro Max 2.01 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫైర్​ బోల్ట్​ నింజా స్మార్ట్​వాచ్ ధర సుమారుగా రూ.1,399 ఉంటుంది.

Fire Boltt Ninja Call Pro Max 2.01 Smartwatch
ఫైర్​ బోల్ట్​ నింజా కాల్ ప్రో మ్యాక్స్​ 2.01

10. Samsung Galaxy Watch5 Features : ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ ఉన్నవారికి, క్రీడాకారులకు ఈ శాంసంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో అనేక హెల్త్, ఫిట్​నెస్​ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy Watch5 Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్​ 5 ధర సుమారుగా రూ.22,999 ఉంటుంది.

Samsung Galaxy Watch5
శాంసంగ్ గెలాక్సీ వాచ్​ 5

'చంద్రుడిపై నుంచి రాళ్లు తీసుకురావడమే టార్గెట్- అది అంత ఈజీ కాదు'

జీ-మెయిల్​ ఎక్స్​పర్ట్ అవ్వాలా? సింపుల్​గా ఈ షార్ట్​కట్స్​ గురించి తెలుసుకోండి!

గూగుల్​ మ్యాప్స్ Fuel Saving ఫీచర్​ - ఇంధనం, డబ్బు రెండూ ఆదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.