ETV Bharat / priya

న్యూ ఇయర్​ స్పెషల్ రెసిపీస్ - ఈ వెరైటీస్​తో పార్టీ అద్దిరిపోద్ది! - రాగి చాక్లెట్‌ కేక్‌

New Year 2024 Cake Making Process: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఎవరి స్థాయిలో వారు పార్టీలూ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఇంట్లో పార్టీ చేసుకునేవారికోసం ఓ సూపర్ కేక్, ఇంకా అద్భుతమైన పులావ్ రెసిపీ తీసుకొచ్చాం. ఇక మీరు స్టౌ వెలిగించడమే ఆలస్యం!

New Year Special
New Year Special
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 5:29 PM IST

New Year 2024 Cake Making Process: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరం అంటే.. కేక్​ కట్ చేయాల్సిందే. డిసెంబర్​ 31 అర్ధరాత్రి పన్నెండు కావడానికి కొద్ది నిమిషాల ముందు.. ఫ్రిజ్​ల్లోంచి కేకులు బయటికి వస్తాయి. అయితే.. చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వీటి ఖరీదు ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అసలే జ్వరాలు.. అందులోనూ కరోనా.. కాబట్టి బయట కొనుగోలు చేసేకన్నా.. కాస్త ఓపిక చేసుకుంటే.. ఇంట్లోనే ఫుల్ హెల్దీ కేక్‌ను ఈజీగా చేసుకోవచ్చు. కేక్​ తోపాటు డిన్నర్​ కోసం ఘుమఘుమలాడే పులావ్ కూడా సిద్ధం చేసుకోవచ్చు.

మీ పిల్లలు కుకీలు కావాలని మారం చేస్తున్నారా? మిల్లెట్​​తో ఇలా ట్రై చేయండి! టేస్ట్​ అండ్​ హెల్త్​ గ్యారెంటీ!

ఎగ్‌లెస్‌ రాగి చాక్లెట్‌ కేక్‌:

కావాల్సినవి:

  • రాగిపిండి-ముప్పావుకప్పు
  • గోధుమపిండి- ముప్పావుకప్పు
  • కోకో పొడి- పావు కప్పు,
  • చక్కెర- అర కప్పు(పొడి చేసుకోవాలి),
  • బేకింగ్‌ పౌడర్‌- చెంచాన్నర,
  • బేకింగ్‌ సోడా- అర చెంచా,
  • పాలు- కప్పున్నర,
  • వెనీలా ఎసెన్స్‌ - పావు చెంచా,
  • కరిగించిన వెన్న- అరకప్పు,
  • ఉప్పు- చిటికెడు,
  • డార్క్‌చాక్లెట్‌- 150 గ్రా.,
  • ఫ్రెష్‌ క్రీమ్‌- 250 ml
  • రాళ్ల ఉప్పు- కొద్దిగా,
  • బాదం పలుకులు- కొన్ని

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

తయారీ విధానం:

  • ముందుగా ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో ఉప్పు వేసి స్టౌ మీద పది నిమిషాలు ప్రీ హీట్​ చేసుకోవాలి.
  • ఈ లోపు ఓ గిన్నె తీసుకుని అందులో.. రాగి, గోధుమ పిండి, కోకో పొడి, చక్కెర, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, చిటికెడు ఉప్పు.. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి కలపాలి.
  • ఇందులో పాలు, వెనీలా ఎసెన్స్‌, కరిగించిన వెన్న వేసి విస్క్‌ర్​తో బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఓ కేక్​ టిన్​ లేదా గుండ్రటి గిన్నె తీసుకుని దాని లోపల అన్ని వైపులా వెన్న రాసి, చెంచా చొప్పున పిండి, కోకో పౌడర్‌ వేసి పాత్ర అంతటా అతుక్కునేలా చూడాలి.

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

  • ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్‌ బ్యాటర్‌ను ఈ పాత్రలో సమంగా పరవాలి.
  • తర్వాత ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న గిన్నెలో కేక్‌ పాత్రను పెట్టి మీడియం ఫ్లేమ్‌ మీద దాదాపు 35 నిమిషాలు కుక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మూత తెరిచి కేకును చల్లారనివ్వాలి.
  • మరోవైపు పొయ్యి మీద మరో పాత్ర పెట్టి డార్క్​ చాక్లెట్‌ ముక్కలు వేసి, ఫ్రెష్‌ క్రీమ్‌ పోసి చిన్న మంటపై నెమ్మదిగా కలుపుతుండాలి. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి.
  • చల్లారిన కేకు పైన ఉబ్బుగా ఉన్న భాగాన్ని కట్‌ చేయాలి.
  • తర్వాత కేకుపై చ్లాకెట్‌ ద్రవాన్ని పోసి, బాదం పలుకులు, చాక్లెట్‌ తరుగుతో గార్నిష్‌ చేసుకుంటే టేస్టీ రాగి చాక్లెట్‌ కేక్‌ రెడీ.

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..!

కశ్మీరీ పులావ్‌:

కావలసినవి:

  • నెయ్యి: టేబుల్‌స్పూను,
  • జీడిపప్పు: పది,
  • కిస్‌మిస్‌ పలుకులు: పదిహేను,
  • పిస్తా పలుకులు: పదిహేను,
  • బాదం పలుకులు: అయిదు,
  • జీలకర్ర: చెంచా,
  • బిర్యానీ ఆకు: ఒకటి,
  • యాలకులు: రెండు,
  • దాల్చినచెక్క: ఒకముక్క,
  • మిరియాలు: అరచెంచా,
  • లవంగాలు: 5,
  • సోంపు: అరచెంచా,
  • ఉల్లిపాయ: ఒకటి,
  • పచ్చిమిర్చి: ఒకటి,
  • ఉప్పు: తగినంత,
  • అల్లంవెల్లుల్లి ముద్ద: ఓ స్పూన్​,
  • కారం: చెంచా,
  • బాస్మతీబియ్యం: కప్పు (ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకోవాలి),
  • కొత్తిమీర: కట్ట,
  • నీళ్లు: ఒకటిన్నర కప్పు

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

తయారీ విధానం:

  • ముందుగా కుక్కర్‌ని స్టౌ మీద పెట్టి వేడెక్కాక నెయ్యి వేయాలి.
  • అది కరిగాక జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకోవాలి.
  • ఆ తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, సోంపు వేయించుకుని.. ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి.
  • ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగాక కారం, ఉప్పు, నీళ్లు, కడిగిన బాస్మతీ బియ్యం, కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  • రెండు విజిల్స్​ వచ్చాక స్టౌ బంద్​ చేయాలి. అంతే ఘుమఘుమలాడే వేడి వేడి కశ్మీరీ పులావ్​ రెడీ..
  • చికెన్​ లేదా మటన్​తో దీనిని తింటే.. నా సామిరంగా అనాల్సిందే

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.