ETV Bharat / opinion

కశ్మీరానికి ప్రజాస్వామ్య చికిత్స

జమ్ముకశ్మీర్​లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ అంశంపై ఆ ప్రాంత నేతలతో.. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న చర్చలు సరికొత్త కశ్మీరానికి అంకురార్పణ కానున్నాయి. దశాబ్దాలుగా హింసతో నలిగిపోయిన సుందరమైన ఈ ప్రాంతానికి ప్రశాంతత చేకూరే నిర్ణయాలు ఈ భేటీలో రావాలని యావత్ భారత్ ఆంకాంక్షిస్తోంది.!

kashmir
జమ్ముకశ్మీర్
author img

By

Published : Jun 24, 2021, 10:01 AM IST

దశాబ్దాలుగా భరతమాత నుదిటిన నెత్తుటి గాయం- జమ్ముకశ్మీరం. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మనం సాహసోపేతమైన వినూత్న చర్యలు తీసుకోవాలని భారత ప్రధానిగా వాజ్‌పేయీ కొత్త సహస్రాబ్ది తొలి వేకువలో అభిలషించగా- 2019 ఆగస్టులో మోదీ సర్కారు చేసింది అక్షరాలా గరళవైద్యం! భారీగా కేంద్ర బలగాల మోహరింపు, అర్ధాంతరంగా అమర్‌నాథ్‌ యాత్ర కుదింపు, కర్ఫ్యూ విధింపు వంటి చర్యల్ని వెన్నంటి- కీలక సరిహద్దు రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాల రద్దు, భౌగోళిక విభజనలతో నాడు కేంద్రం పెను రాజకీయ భూకంపమే సృష్టించింది. పక్షం రోజులుగా మిలిటరీ మోహరింపు విస్తృతమైన నేపథ్యంలో మళ్లీ ఏం మూడుతుందోనన్న భయాందోళనలు స్థానికంగా పెరిగిన వేళ- ప్రధానితో అఖిలపక్ష భేటీ శుభవార్త చెవిన పడింది.

కొత్త పొద్దు..

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సహా ప్రభావశీల రాజకీయ నేతలు 14 మందితో నేడు ప్రధాని సమావేశం- అక్కడ రాజకీయ స్తబ్ధతను బదాబదలు చేసే క్రమంలో తొలి ముందడుగు కానుంది. తమ నుంచి గుంజుకొన్న వాటన్నింటినీ తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్ముకశ్మీర్‌లో గుప్కార్‌ కూటమి పురుడు పోసుకోవడం తెలిసిందే. రాష్ట్ర హోదాతో పాటు కోల్పోయిన ప్రత్యేక ప్రతిపత్తి కోసమూ పట్టు పడతామన్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్లన్నీ అరిగిపోయిన రికార్డే! ప్రశాంత కశ్మీరాన్ని సృష్టించుకొందామంటూ 370 అధికరణ రద్దును రెండేళ్ల క్రితం గట్టిగా సమర్థించుకొన్న ప్రధాని- రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, మళ్ళీ ఎన్నికలూ జరుపుతామనీ అప్పుడే హామీ ఇచ్చారు. నేడు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ ప్రకాశ్‌ దేశాయ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ పునర్విభజన చురుకుగా సాగుతున్న తరుణంలో తాజా రాజకీయ సంప్రదింపుల కదలిక- కశ్మీరానికి కొత్త పొద్దు పొడుపు కావాలిక!

ఇదీ చదవండి: 'కశ్మీర్‌' సమస్యకు త్వరలోనే రాజకీయ పరిష్కారం!

భారత రాజ్యాంగ పరిధికి ఆవల జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగానికి ఎలాంటి సార్వభౌమాధికారమూ లేదని, రాష్ట్ర రాజ్యాంగమైనా భారత రాజ్యాంగానికి లోబడాల్సిందేనని 2016 డిసెంబరులోనే సుప్రీంకోర్టు విశిష్ట తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 370 అధికరణ శాశ్వత హోదా పొందిందని 2018 ఏప్రిల్‌లో 'సుప్రీం' న్యాయపాలికే స్పష్టీకరించినా- ఆ 'ప్రత్యేక' నిబంధనలకు అక్షరాలా 'బైపాస్‌ సర్జరీ' చేసిన మోదీ ప్రభుత్వం, పార్లమెంటు శాసనాలన్నీ నేరుగా అక్కడా అమలయ్యేలా రాజ్యాంగాన్ని సవరించింది. రాజ్యాంగంలోని 21వ విభాగం కింద జమ్ముకశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణను తాత్కాలిక నిబంధనగానే పొందుపరిచారన్నది నిజం.

ఇదీ చదవండి: 'కశ్మీర్​పై భారత్ చర్యలను అడ్డుకుంటాం'

1957 జనవరి 26న జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగ సభ రద్దుతో ఆ నిబంధనకూ కాలం చెల్లిందన్న వాదనలూ బలంగా ఉన్నాయన్నది వాస్తవం. కొన్ని వర్గాల్లో భారత్‌ వ్యతిరేక భావజాలం పెంచడానికి 370, 35ఏ అధికరణలను ఆయుధాల్లా ఉపయోగించుకొని పాకిస్థాన్‌ సాగించిన ప్రచ్ఛన్న యుద్ధంలో 42 వేల మంది అభాగ్యులు బలైపోయారన్న ప్రధాని వాటి పునరుద్ధరణ ప్రశ్నే లేదని లోగడే స్పష్టీకరించారు. శాశ్వత పరిష్కారం దిశగా పాకిస్థాన్‌తోనూ చర్చలు జరపాలంటూ పాచిపాటే పాడుతున్న పీడీపీ నేతలు క్షేత్రస్థాయి వాస్తవాల్ని విస్మరించకూడదు.

వెల్లివిరిసిన ప్రజాస్వామ్యం..

నిరుడు డిసెంబరులో జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికలు నిర్వహిస్తే, లోక్‌సభ నాటి కంటే 15 శాతం అధికంగా పోలింగ్‌లో పాల్గొన్న కశ్మీరీలు ప్రజాస్వామ్యానికి జై కొట్టారు. 370 అధికరణ రద్దు దరిమిలా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు 140 శాతం పెరిగాయని, ఉగ్రవాద దుశ్చర్యలు 60 శాతం తగ్గాయని వెల్లడిస్తున్నాయి గణాంకాలు! ఈ పరిస్థితుల్లో దాయాది దేశం కుతంత్రాలిక సాగవని స్పష్టీకరించేలా జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, సత్వర ఎన్నికలకు పార్టీలన్నీ ఏకోన్ముఖం కావాల్సిన తరుణమిది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.