ETV Bharat / opinion

పాన్​ మసాలానే కాదు.. పొగాకు ఉత్పత్తినే నిషేధించాలి! - coronavirus precautions

కరోనా వైరస్ విషకోరల నుంచి ప్రజలను బయటపడేసేందుకు పాన్​మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను నిషేధించింది కేంద్రం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల వైరస్ విస్తరించే ప్రమాదం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా దీర్ఘకాలిక కార్యాచరణ చేపట్టాలని వినతులు వస్తున్నాయి. పొగాకు ఉత్పత్తినే నిలిపివేయాలనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు వినియోగం, తద్వారా జరిగే పరిణామాలపై సమగ్ర కథనం.

corona
పాన్​ మసాలానే కాదు.. పొగాకు ఉత్పత్తినే నిషేధించాలి!
author img

By

Published : Apr 13, 2020, 8:19 AM IST

కరోనా మహమ్మారి విష కోరల బారినపడకుండా జనసామాన్యాన్ని కాచుకొని, తక్షణ వైద్య సేవలతో వ్యాధి సోకినవారిని రక్షించుకోవాలని ప్రపంచ దేశాలన్నీ శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా 18 లక్షలు దాటిన కేసులతో.. లక్షా 12 వేల మందిని కబళించిన కరోనా, ఇండియాపైనా కసిగా కోరలు చాస్తోంది. మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటనతో, కరోనా మృత్యు పాశాలకు చిక్కకుండా.. ఏకంగా ఎనిమిది లక్షల 20వేల మందిని కాపాడుకోగలిగామన్న కేంద్ర ప్రభుత్వం, కొవిడ్‌ వ్యాప్తి నిరోధకంగా మరో కొత్త జాగ్రత్తను ప్రతిపాదించింది.

పాన్‌ మసాలా, సుపారీ వంటి పొగాకు ఉత్పాదనల్ని నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కొవిడ్‌ విస్తరించే ప్రమాదం ఉందంటూ వాటి వినియోగాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. బిహార్‌, ఝార్ఖండ్‌, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, హరియాణా, నాగాలాండ్‌, అసోం ఇప్పటికే చొరవ చూపాయంటూ తక్కిన రాష్ట్రాలూ తక్షణ నిషేధం విధించాలని సూచిస్తోంది. 24 కోట్లకు చేరువైన ఉత్తర్‌ ప్రదేశ్‌ జనాభాలో 5.3 కోట్లమంది ఏదో ఒక రూపంలో పొగాకును సేవిస్తున్నారని గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే నిగ్గుదేల్చింది.

గణాంకాలివే

సిగరెట్లు, బీడీల వాడకం తగ్గి ఖైనీ (15.9శాతం), గుట్కా (11.5), సుపారీ (10.2), పాన్‌ మసాలా (7.2శాతం)ల వినియోగం విస్తరించినట్లు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ అధ్యయనం చెబుతోంది. నోరు, అన్నవాహిక, క్లోమగ్రంథి క్యాన్సర్ల నుంచి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లదాకా ఎన్నింటికో దారితీసే పొగాకు సేవనం.. కొవిడ్‌ మహమ్మారికి ఆహ్వానం పలకడమే అవుతుందనడంలో సందేహం లేదు. పొగతాగేవారికి న్యుమోనియా వచ్చే అవకాశం 14 రెట్లు అధికమని కొవిడ్‌ రోగులపై సాగిన పరిశీలనే స్పష్టీకరించినప్పుడు, విశాల జనహితం దృష్ట్యా 'పగాకు' పైనే నిషేధం విధించే దిశగా విధాన రచనకు ఉపక్రమించక తప్పదు!

ఆరోగ్య భారత్​ కోసం

‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకొనేది’ అని సర్వోన్నత న్యాయపాలిక పదిహేనేళ్ల క్రితమే ప్రజా ప్రభుత్వాలకు సంక్షేమ రాజ్య బాధ్యతలు గుర్తు చేసింది. అయినా సర్కార్లకు ఆదాయ వనరులుగా మద్యం పొగాకు ప్రవర్ధమానమవుతుంటే బడుగుల జీవితాలే అక్షరాలా చితికిపోతున్నాయి. ఇండియాలో ఏటా 85 వేల మంది పురుషులు, 34 వేల మంది స్త్రీలు నోటి క్యాన్సర్‌ బారినపడుతున్నారని, 90 శాతం కేసులకు పొగాకు సేవనమే కారణం కాగా, సగానికిపైగా నమిలే పొగాకు పుణ్యమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికే చెబుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల ఖైనీ, జర్దా, గుట్కా వంటివాటిని ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమైన నేపథ్యంలో 2016లో 'సుప్రీం' మరోమారు ప్రజారోగ్య పరిరక్షణ ప్రాధాన్యాన్ని ప్రభుత్వాలకు గుర్తు చేసింది. అయినా లాక్‌డౌన్‌ కాలంలో డ్రోన్‌ సాయంతో పాన్‌ మసాలా చేరవేసే స్థాయిలో పొగాకు వ్యసనం శ్రుతిమించింది. కాన్పూర్‌ కేంద్రంగా వంద బ్రాండ్లకుపైగా గుట్కా వంటివి ఉత్పత్తి అవుతూ అన్ని రాష్ట్రాలకూ ఎగుమతి అవుతున్నాయంటే ఏమనుకోవాలి? పొగాకు సేవనంతో రోగగ్రస్తుడైన వ్యక్తి కఫం.. గాలి ద్వారా వ్యాపించే క్షయ, న్యుమోనియాల వంటి శ్వాసకోశ వ్యాధుల ప్రజ్వలనానికి కారణభూతమవుతుంది. అలాంటివారు కరోనా బారినపడితే ఇంకేముంది? ఆ ప్రమాదాన్ని నివారించడానికి కరోనా కాలంలో తాత్కాలికంగా పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించడమే కాకుండా.. ఏటా లక్షల కుటుంబాల్లో సౌభాగ్యం పొగచూరిపోవడానికి కారణమవుతున్న పొగాకు సాగునే నిలిపివేసే ప్రయత్నాలు మొదలవ్వాలి. పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు మళ్ళించి పరిశ్రమలోనివారి బతుకు తెరువుకు భరోసా ఇచ్చినప్పుడే జాతి ఆరోగ్యానికి కొత్త ఊపిరులు ఊదగలిగేది!

ఇదీ చూడండి: కరోనా పంజా: అగ్రరాజ్యంలో గరిష్ఠ స్థాయికి వైరస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.