ETV Bharat / opinion

ఉరుముతున్న మూడో ముప్పు- అప్రమత్తతతోనే అడ్డుకట్ట - covid-19 updates

కరోనా ఆంక్షలతో(Corona In India) అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మార్కెట్లలో తిరిగి సందడి నెలకొంటోంది. అయితే.. ప్రమాదం ఇంకా పొంచే ఉందంటున్న శాస్త్రవేత్తల తాజా అధ్యయనం- అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తోంది. మూడో ఉద్ధృతి(Corona Third Wave In India) ఈ నెలలోనే మొదలై వచ్చే ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్యలో తారస్థాయిని అందుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

corona third wave in india
కరోనా మూడో దశ
author img

By

Published : Oct 7, 2021, 6:47 AM IST

ఊహకందని ఉత్పాతంగా మానవాళిపై విరుచుకుపడిన కరోనా మహమ్మారి(Corona In India) విశ్వవ్యాప్తంగా సుమారు యాభై లక్షల మందిని బలితీసుకుంది. ఇండియాలో దాదాపు నాలుగున్నర లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొవిడ్‌ రెండో దశ పతాకస్థాయికి చేరిన సమయంలోనైతే ప్రాణవాయువుకూ నోచుకోక ఎన్నో ఆయువులు గాలిలో కలిసిపోయాయి. ఆ తరవాత మూడో ఉద్ధృతిపై(Corona Third Wave In India) పోటెత్తిన కథనాలు జనబాహుళ్యంలో తీవ్ర కల్లోలం రేకెత్తించాయి. చిన్నారులకు అది పెనుశాపంగా పరిణమించనుందన్న విశ్లేషణలు భయాందోళనలు సృష్టించాయి. అవేమీ వాస్తవాలు కావని, అసలు కొవిడ్‌ మూడో దశే(Corona Third Wave In India) ఎదురుకాకపోవచ్చని, ఒకవేళ తలెత్తినా దాని కల్లోలం మునుపటిలా ఉండబోదంటూ భిన్న వాదనలు వెలుగుచూశాయి.

కొత్త కోరలు తొడిగే ప్రమాదం..

ఆంక్షలతో(Corona Restrictions In India) అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. విపణి వీధుల్లో తిరిగి సందడి నెలకొంటోంది. ప్రమాదం ఇంకా పొంచే ఉందంటున్న శాస్త్రవేత్తల తాజా అధ్యయనం- అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తోంది. మూడో ఉద్ధృతి(Corona Third Wave In India) ఈ నెలలోనే మొదలై వచ్చే ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్యలో తారస్థాయిని అందుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వ్యాపార, వినోద కార్యకలాపాలు ఊపందుకోవడం; సామాజిక, రాజకీయ, మత కార్యక్రమాల్లో ప్రజలు పెద్దయెత్తున పాలుపంచుకోవడం వైరస్‌కు కొత్త కోరలు తొడిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి విలయ తాండవం పునరావృతం కాకూడదంటే- దేశీయంగా టీకా ప్రక్రియ మరింత వేగం పుంజుకోవాల్సిందే!

జనాభాలో 60శాతానికి..

కొవిడ్‌పై పోరాటంలో(Corona In India) ఇండియా ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఆదిలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, కొన్నాళ్లుగా టీకా కార్యక్రమం(Vaccination Status In India) కుదురుకుంది. ఆసేతుహిమాచలం 70శాతం వయోజనులకు తొలి విడత వ్యాక్సిన్‌ అందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. రెండు డోసులూ పొందిన వారు 25శాతమని అధికారులు చెబుతున్నారు. గడచిన వారంలో దేశవ్యాప్తంగా ప్రజలకు అందిన రోజువారీ టీకాల సగటు 61 లక్షలుగా లెక్కతేలింది. మూడో ముప్పును నివారించాలంటే ఈ సంవత్సరాంతానికల్లా జనాభాలో అరవైశాతానికి పూర్తిస్థాయి టీకా రక్షణ లభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటేే- నేటి నుంచి రోజుకు 1.35 కోట్ల డోసుల చొప్పుల టీకాల పంపిణీ జరగాలి! అంటే ప్రస్తుతం ఒకరోజులో వేస్తున్న వ్యాక్సిన్లను రెండు రెట్లకు పైగా పెంచి డిసెంబరు 31 వరకు ఆ యజ్ఞాన్ని నిరవధికంగా కొనసాగించాలి!

మార్గదర్శకాలను మరిచిపోతున్నారు..

మరోవైపు వ్యాక్సిన్‌ మైత్రిలో(Vaccine Maitri) భాగంగా ఇతర దేశాలకు టీకాల వితరణను పునఃప్రారంభించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందితేనే అందరూ సురక్షితులు అవుతారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు అనుగుణంగా మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం(Vaccine Maitri) అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. దేశీయ అవసరాలకు విఘాతం కలగకుండా టీకా దౌత్యాన్ని ఫలవంతం చేసే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం పట్టాలెక్కించాలి. అందుకుగానూ టీకాల ఉత్పత్తిని ఇతోధికం చేసే అవకాశాలను పరిశీలించాలి. చిన్నారుల టీకాలపై ప్రయోగాలను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తేవడమూ కీలకమే. వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భావనలో కొవిడ్‌ మార్గదర్శకాల ఊసే మరచిపోతున్నవారి సంఖ్యా అధికంగానే ఉంది. అటువంటి పెడపోకడలను కట్టడి చేయడంలో ప్రభుత్వాల ఉదాసీనతపై భారతీయ వైద్యుల సంఘం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఆపత్కాలంలో స్వీయజాగ్రత్తలే శ్రీరామరక్ష అన్న చైతన్యం జనవాహినిలో పాదుకొనాలి. ఆబాలగోపాలాన్ని వీలైనంత త్వరగా టీకా రక్షణ పరిధిలోకి చేర్చే వ్యూహాలకు ప్రభుత్వాలు పదునుపెట్టాలి. పాలకులు, ప్రజలు ఏకతాటిపై పోరు సాగిస్తేనే- వైరస్‌ విజృంభణను సమర్థంగా నిలువరించగలం!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.