LIVE జగన్‌రెడ్డి ఎన్నికల అక్రమాలకు 'జై' కొట్టే అధికారులు జైలుకే- టీడీపీ నేత బోండా ఉమా మీడియా సమావేశం - బోండా ఉమా మీడియా సమావేశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 11:11 AM IST
|Updated : Jan 19, 2024, 11:29 AM IST
LIVE : వైఎస్సార్సీపీకి తాబేదార్లుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడుతున్న పలువురు అధికారులకు ఈసీ కఠిన చర్యలకు దిగింది. 2021 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి అక్రమంగా డౌన్‌లోడ్ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి సహకరించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా పనిచేసిన గిరీషా లోక్‌సభ ఉప ఎన్నికకు ఈఆర్‌ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆయన లాగిన్ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకుపైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని రుజువైంది. వాటిపై ఫొటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని, స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి.
జగన్ రెడ్డి ఎన్నికల అక్రమాలకు 'జై' కొడితే అధికారులు జైలుకే - మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.