LIVE: ఎన్టీఆర్ వర్ధంతి - ప్రముఖుల నివాళులు ప్రత్యక్ష ప్రసారం - హైదరాబాద్‌లో ఎన్టీఆర్ వర్ధంతి లైవ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 7:52 AM IST
|Updated : Jan 18, 2024, 8:09 AM IST
NTR Ghat Live : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పూలతో అలంకరించారు ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. తమ ప్రియతమ నాయకుడు, అభిమాన నటుడికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూల చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామరావు అని అన్నారు. ఆయన జీవితం పెద్ద పాఠ్యాంశమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ అమర్ రహై అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుచోట్ల వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.