* ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు మీరు మామూలుగానే మాట్లాడినా ఆ మాటలు వాళ్లను బాధించవచ్చు. మీరు సరదాకు ఏమైనా అన్నా వాళ్లు సీరియస్‌గా తీసుకుని గొడవ పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకే మాట్లాడుతున్నప్పుడు ఓ కంట భాగస్వామిని కనిపెడుతూ ఉండాలి.
* చిరాగ్గా ఉన్నప్పుడు దాన్ని మనసులోనే పెట్టుకుని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. దీంతో బాధ మరింత పెరుగుతుందేగానీ తగ్గదు. దాన్ని భాగస్వామితో పంచుకుంటే బాధ సగమవుతుంది.. సంతోషం రెట్టింపవుతుంది. మనసులోని బాధలను పంచుకోవడానికి మనకో మనిషి ఉన్నారనే భావనే ఎంతో సంతృప్తినీ ఇస్తుంది.
* దంపతుల మధ్య ఎన్ని చిరాకులూ, కోపతాపాలున్నా వాటితో అలాగే నిద్రపోవడానికి ప్రయత్నించకూడదు. ఏరోజు సమస్యలను ఆ రోజే పరిష్కరించుకుంటేనే మనసుకు హాయిగా ఉంటుంది. లేకపోతే అవే సమస్యల గురించి పదేపదే ఆలోచిస్తూ పడుకుంటే సరిగా నిద్రపట్టదు. మర్నాడు లేచిన తర్వాత కూడా మళ్లీ అవే గుర్తుకువచ్చి బాధిస్తాయి.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు