కొట్టకూడదు...
క్రమశిక్షణతో పెంచాలనే ఉద్దేశంతో పిల్లలను కొట్టకూడదు. ఇలాచేస్తే మరీ మొండిగా తయారవుతారు. ప్రతి చిన్న విషయానికీ పేచీ పెట్టడం మొదలుపెడతారు. మీరు 'వద్దు, కాదు' అని చెప్పినప్పుడల్లా అదే చేస్తానని మారాం చేస్తారు. అలాకాకూడదంటే.. ఆ పని చేయడం వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు అర్థమయ్యేలా కాస్త సహనంతో వివరించాలి.
నియంత్రించాలని చూడొద్దు:
పిల్లల ప్రవర్తనను పెద్దవాళ్లు నియంత్రించాలని చూస్తుంటారు. అలాగే వారి ఆలోచనలనూ నియంత్రిస్తుంటారు. ఇలా చేయడం చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాకాకూడదంటే వాళ్లను స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి. అలాగే వారి ఆలోచనలనూ మీతో పంచుకోనివ్వాలి.
ఇష్టంలేకపోయినా సరే:
చిన్నారులు తమ తోబుట్టువులు లేదా స్నేహితుల మీద ఒక్కోసారి అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడూ వాళ్లతో పోట్లాడుతుంటారు కూడా. ఇలాంటప్పుడు మనకు ఇష్టం లేకపోయినా ఎదుటివాళ్లను ఏం అనకూడదనే విషయాన్ని కాస్త వివరంగా చెప్పాలి.
ప్రశంసించాలి:
చిన్నారులు పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించినప్పుడు వాళ్లను తప్పకుండా ప్రశంసించాలి. అలాగే అసహనంతో కారణం లేకుండా పిల్లలను కోప్పడితే వెంటనే వాళ్లకు సారీ చెప్పేయాలి. ఇలాచేయడం వల్ల తప్పుచేస్తే మన్నించమని అడగాలనే విషయం వాళ్లకు తెలుస్తుంది.
- ఇదీ చూడండి : 'సీటీమార్' టీజర్.. మహేశ్ సినిమా షెడ్యూల్ పూర్తి