ఏలా చేయాలంటే..
ఆలివ్‌నూనె, మాయిశ్చరైజర్, కొబ్బరినూనె, నైట్‌క్రీమ్...ఇలా చర్మానికి తేమనందించే వాటిని తీసుకుని ముఖం, మెడా, చేతులూ వంటి చోట్ల రాయాలి. ఆపై ఓ అయిదు నిమిషాలపాటు ముని వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి.
ప్రయోజనాలు..
మర్దనా చేయడం వల్ల ముడతలు, గీతలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. స్కిన్‌కు తగినంత తేమ లభించి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
ఎక్కువ సేపు కంప్యూటర్, టీవీ చూడటం వల్ల ముఖంలోని కండరాలు అలసిపోతాయి. మసాజ్ వల్ల ఇవి సాంత్వన పొందుతాయి. మర్దనా కోసం నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. మసాజ్ వల్ల రక్తప్రసరణ పెరిగి చర్మం శుభ్రపడుతుంది దాంతోపాటు మెరుపులీనుతుంది.
తరచూ మర్దనా చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గడంతోపాటు మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ పోతాయి. కళగానూ కనిపిస్తుంది.
మసాజ్ వల్ల చర్మం తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది. పొడిబారే చర్మతత్వం ఉన్నవారు క్రమం తప్పకుండా చేయొచ్ఛు చర్మం యౌవనంగా కనిపించేందుకు సాయపడే కొలాజిన్ మెరుగుదలకు ఈ మసాజ్ తోడ్పడుతుంది.