- బెల్లంలో యాంటీఆక్సిడెంట్లూ ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలూ తగినంతగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాదు బెల్లాన్ని చర్మ సంరక్షణ కోసం వినియోగించడం వల్ల వయసు కంటే ఎక్కువగా కనిపించే సమస్యని అదుపులో ఉంచుకోవచ్ఛు మరిన్ని లాభాల్నీ తెలుసుకుందామా..
- జుట్టు కాంతివిహీనంగా కనిపిస్తున్నప్పుడు... రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకోండి. దానికి రెండు చెంచాల బెల్లం పొడి, అరకప్పు పెరుగు, కొద్దిగా నిమ్మరసం చేర్చి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఓ ఇరవై నిమిషాలు ఉంచి కడిగేసుకోండి. ఆ తరువాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయండి. జుట్టు నిగనిగలాడిపోతుంది.
- వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మొటిమలు, యాక్నే ఇబ్బందిపెడతాయి. రెండు చెంచాల బెల్లంపొడిలో అరచెక్క నిమ్మరసం, కాసిన్ని నీళ్లూ చేర్చి ముఖానికి పూతలా వేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే మీ సమస్య దూరమవుతుంది.
బెల్లాన్ని స్వీట్ల తయారీలోనే కాదు.. ఇలా కూడా వాడొచ్చు! - joggery can be used for healthy hair
బెల్లాన్ని స్వీట్లు తయారు చేసుకోవడానికీ, వంటల తయారీలోనూ వాడతామని తెలుసు. కానీ ఇది జుట్టు, చర్మ సంబంధ సమస్యల్ని దూరం చేసి కళగా కనిపించేలా చేస్తుందని తెలుసా? లేదంటే ఇది చదివేయండి.!
![బెల్లాన్ని స్వీట్ల తయారీలోనే కాదు.. ఇలా కూడా వాడొచ్చు! బెల్లాన్ని స్వీట్ల తయారీలోనే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8611292-14-8611292-1598755703317.jpg?imwidth=3840)
బెల్లాన్ని స్వీట్ల తయారీలోనే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!