ETV Bharat / lifestyle

ఆ బార్లను తయారు చేసుకుంటే చాలు!

కాలేజీలో చదివి చదివి అలసిపోయిన విద్యార్థులకే కాదు.. ఆఫీస్​లో బండెడు చాకిరి చేసి అలసిపోయిన ఉద్యోగికీ ఓ బార్ ఉంది. దాన్ని రుచి చూస్తే.. వదలరు మరి. తిన్నంత సమయం చాలు శక్తి పుంజుకోవడానికి. ప్రోటీన్లున్న అవిసె గింజలు... పీచు నిండిన ఓట్స్​ వేటితోనయినా.. ఈ ఎనర్జీ బార్లని తేలిగ్గా.. చేసుకోవచ్చు. అలసిన సమయంలో.. ఇవి మీ చేతిలో... ఉంటే ఇక మీరు శక్తిమాన్ అయిపోయినట్లే..

best protein to women energy bars
author img

By

Published : Oct 20, 2019, 12:21 PM IST

Updated : Oct 20, 2019, 1:01 PM IST

రాజ్​గిర్ బార్
కావాల్సినవి: బెల్లం-కప్పు, నీళ్లు-రెండు చెంచాలు, నెయ్యి-అరచెంచా, రాజ్​గిరా పేలాలు-కప్పు, యాలకుల పొడి-అరచెంచా.
తయారీ: ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తీసుకుని పొయ్యిమీద పెట్టి కరిగించుకోవాలి. అందులో నెయ్యి కూడా వేసుకుని పాకం వచ్చేంతవరకూ ఉంచి.. స్టౌ కట్టేయాలి. దీనిలో కొబ్బరి పొడి, వేయించిన పల్లీలు, రాజ్​గిరా పేలాలు, యాలకుల పొడి వేసుకుని అన్నీ ఒకదానితో ఒకటి కలిసెటట్టు బాగా కలుపుకోవాలి. వెడల్పాటి పాత్రకు నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా.. సర్దుకోవాలి. ఈ పాత్రను ఫ్రిజ్​లో ఉంచి గంట తర్వాత నిలువుగా ముక్కలు కింద కోసుకోవాలి. ఇవి నెలరోజుల వరకూ నిల్వ ఉంటాయి.

ఓట్స్​ బార్​
కావాల్సినవి: ఓట్స్​-నాలుగు చెంచాలు, బటర లేదా పీనట్ బటర్​-చెంచా, తేనే-అరచేంచా
తయారీ: ముందుగా అవెన్​లో కానీ మందపాటి పాత్రలో కానీ బటర్​ను కరిగించుకోవాలి. అందులో తేనె, ఓట్స్​ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎనర్జీ బార్స్​ చేసుకునే మూసలు మార్కెట్లో దొరుకుతాయి. అందులో వేసి సమంగా సర్దుకోవాలి. వీటిని ఫ్రిజ్​లో రాత్రంతా ఉంచి తెల్లారి తీస్తే చక్కగా వస్తాయి.

అవిసె గింజలతో...
కావాల్సినవి: తెల్ల నువ్వులు-పావు కప్పు, నల్ల నువ్వులు-అరకప్పు, అవిసెగింజలు-అరకప్పు, తేనె-అరకప్పు
తయారీ: దళసరిపాటి కడాయిలో నువ్వులు, అవిసె గింజలని మాడిపోకుండా మంచి వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకుని తేనె పోస్తూ.. గరిటెతో చక్కగా కలుపుకోవాలి. అవెన్ని ముందుగా ప్రీహీట్​ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. బేకింగ్ చేసే పాత్రకు లోపల బటర్​ కానీ నెయ్యి కానీ రాసి నువ్వులు-అవిసె గింజల మిశ్రమాన్ని సమానంగా సర్దు కొని అవెన్​లో ఇరవై నిమిషాలపాటు వేడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుని నిల్వ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:ఆ 'కిరణ్మయి' నిలిపింది.. నాలుగేళ్ల 'కవిరాజ్'​ జీవితాన్ని..

sample description
Last Updated : Oct 20, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.