వల్జీర్ సిగాటో... సాధారణంగా బాడీబిల్డర్‌గా మారాలని జిమ్‌కి వెళ్లేవాడట. అయితే 50 ఏళ్ల వయసులో ఇతను కోరుకున్న కండలు రాకపోవడంతో... సింథాల్‌గా పిలిచే నూనె, ఆల్కహాల్, పెయిన్‌కిల్లర్ల ద్రావణాన్ని కండలకు ఎక్కించుకుంటున్నాడట. దీంతో ఇతని కండలు ఇలా అయ్యాయి. ఇంతకు ముందు ఇతనో మత్తుమందు బానిస కూడా.
శరీరం చిక్కి శల్యమైపోయింది. ఎండుకుపోయినట్టు ఉండే అతన్ని చూసి స్నేహితులు ఎగతాళి చేసేవారట. బక్కోడు... అనే పిలుపు నుంచి ఎలాగైనా కండల వీరుడు అని పిలిపించుకోవాలని ఇలా చేస్తున్నాడట. శరీరాకృతి కోసం ఇలా చేస్తే... కండల వీరుడు అని పిలవడం పక్కనుంచి అసలు పిలవడానికే లేకుండా పోతాడేమోనని 'నెట్' జనం భయపడుతున్నారు.
ఇదీ చదవండి: చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..!