ETV Bharat / lifestyle

కరోనా పై డబ్ల్యూహెచ్ ఓ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

author img

By

Published : Jul 14, 2020, 7:02 AM IST

కరోనా నుంచి కోలుకోవటం పెద్ద కష్టమేమీ కాదు..! ప్రపంచఆరోగ్య సంస్థ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ వరకూ చెబుతున్న మాట ఇదే. ఇందుకు కావాల్సిందల్లా ఒక్కటే. నిర్లక్ష్యం పక్కన పెట్టి ప్రభుత్వ నిబంధనలు పాటించటం. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే అది కుటుంబ సభ్యులకూ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు డబ్లూహెచ్ఓ ప్రపంచదేశాలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తూ... కరోనా కట్టడికి కృషి చేస్తోంది. ఇక ఈ కరోనా నుంచి కోలుకున్న వారు కూడా తాము సరైన జాగ్రత్తలు తీసుకున్నందునే ముప్పు తప్పిందని స్పష్టం చేస్తున్నారు.

who Guidelines
కరోనా పై డబ్ల్యూహెచ్ ఓ మార్గదర్శకాలు
కరోనా పై డబ్ల్యూహెచ్ ఓ మార్గదర్శకాలు

భౌతిక దూరం పాటించండి..! మాస్క్‌లు ధరించండి. చేతులు తరచు శుభ్రం చేసుకోండి. మొదటి నుంచి ప్రపంచఆరోగ్య సంస్థ చేస్తున్న సూచనలివి. ఇప్పుడప్పుడే కరోనా ప్రభావం తగ్గిపోదని చెబుతూనే...ఎప్పటికప్పుడు అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇటీవల గాలిద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న చర్చ మొదలు కాగా...ఆ విషయంపైనా స్పష్టతనిచ్చింది. గాలిద్వారా వైర‌స్ వ్యాపించే అవ‌కాశాన్ని అంగీక‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ, కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్యమ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, వ్యాయామ త‌రగ‌తులు నిర్వహించే ప్రదేశాల్లో మాత్రమే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్యయ‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది. అంతే కాదు...లక్షణాలు లేని వ్యక్తులతో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగానే ఉంటుందని వెల్లడించింది. వైద్యుల సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తే కరోనా నుంచి బయటపడటం సులభమేనని పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

ఇక కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కరోనా కట్టడికి సంబంధించి నిత్యం పలు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. తక్కువ లేదా ప్రాథమిక స్థాయిలో కొవిడ్‌-19 ఉన్న బాధితులు ఇంటివద్దనే ఐసోలేషన్‌లో ఉండవచ్చని వివరిస్తోంది. ఇంటివద్ద సదుపాయం ఉండి, ప్రభుత్వ నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాథమికస్థాయి కరోనా రోగులు తమ ఇంటి వద్దనే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా బాధితులకు వ్యాధి అతి తక్కువ లేదా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు సంబంధిత వైద్యులు ధ్రువీకరించి సిఫార్సు చేయాలి. కొవిడ్‌ బాధితుడు సెల్ఫ్‌-ఐసోలేషన్‌ నిబంధనలను తప్పక పాటించటమే కాకుండా... ఆ మేరకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే...హెచ్‌ఐవీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారు కచ్చితంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిందే.

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం కొవిడ్‌ బాధితుడు ఇంట్లోనే విడి గదిలో ఉండాలి. సర్జికల్ మాస్క్‌లు ధరించటం, గదిలో వెలుతురు బాగా ఉండేలా చూసుకోవటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరగబెట్టి చల్లార్చిన నీరును తగినంతగా తాగాలి. బాధితులు బ్లూటూత్‌, వై-ఫై ద్వారా జిల్లా నిఘా అధికారికి, నిఘా బృందానికి నిరంతర పర్యవేక్షణకు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని, వివరాలు తెలియచేస్తూ ఉండాలి. ఆ మేరకు కొవిడ్‌-19 బాధితులు ధృవపత్రం సమర్పించాలి. కరోనా బాధితుల నివాసం సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు అనుగుణంగా ఉండాలి. మిగిలిన కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్లో ఉండాలి. సహాయకులు, వారి సంబంధీకులు వైద్యాధికారి సూచించిన ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం తీసుకోవాలి. బాధితుడు, సహాయకుడు ఇద్దరి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఉండాలి. అన్నివేళలా ఆ యాప్‌ను యాక్టివ్‌గా ఉంచాలి.

ఆహరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ..

ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంపొందించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో పోషకాలన్నీ సమతులంగా ఉండేలా చూసుకుంటే, రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు మనపై కోవిడ్ లాంటి వ్యాధులు దాడి చేసినా, ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అందుకే, కరోనా వైరస్ బాధితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బలవర్థకమైన ఆహారం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ పోషకాలన్నీ నిరు పేదలకు లభించటం కష్టం అలాంటి వారు వంటింట్లో లభించే వాటినే వాడుకుంటే మంచిది. అది కూడా కష్టమైతే సామాజిక దూరం పాటించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.

కరోనా పై మార్గదర్శకాలు..
అయితే..కేంద్రం ఇటీవల హోం ఐసోలేషన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఐసొలేషన్‌ గడువును పది రోజులకు కుదించింది. ఈ కాలంలో వరుసగా 3రోజులపాటు ఎలాంటి లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయొచ్చని సూచించింది. హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేసింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం.. లక్షణాలు లేని పాజిటివ్‌ రోగులను హోం ఐసోలేషన్‌కు తరలిస్తోంది. పది రోజుల్లో వైరస్‌ను జయిస్తున్నాననే నమ్మకంతో ఉండటమే హోం ఐసోలేషన్‌లో కీలక అంశం.

ప్రభుత్వం అన్నివేళలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్న విషయం మరిచిపోవద్దు. జ్వరం పెరగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, ఇతర లక్షణాలు ఎక్కువైతే అప్పటి వరకు అనుసంధానంలో ఉన్న ప్రభుత్వ వైద్యులకు సమాచారం అందించాలి. అకస్మాత్తుగా లక్షణాలు ఎక్కువైన సమయంలో ధైర్యంగా ఉండాలి. డిజిటల్‌ థర్మామీటర్‌ వెంట ఉంచుకొని తరుచూ జ్వరం ఎంత ఉందో చూసుకోవాలి. బీపీ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. పారాసిటమాల్‌ 650, విటమిన్‌ సీ, డీ, జింక్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి. ఒకటి రెండు రకాల యాంటీ బయాటిక్స్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి. వీటన్నింటిని వైద్యుల సలహా మేరకు వాడాలి.

ధైర్యమే కరోనాకు వాక్సిన్..‌ .

పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేనివారు ఇంట్లో ఉండొచ్చు. కుటుంబ సభ్యులకు దూరంగా రెండు వారాల పాటు ప్రత్యేక గదిలో ఉంటే చాలు. ప్రభుత్వం తరఫున వైద్యులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కరోనాకు వాక్సిన్‌ ధైర్యమే. మనం ఎంత ధైర్యంగా ఇంట్లో ఉంటే అంత బలంగా వైరస్‌ను ఎదుర్కోగలం. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు మనోధైర్యంతో, జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండండి అని కరోనా నుంచి కోలుకున్న వారు చెబుతున్నారు. పూర్తిగా నయం అయినట్టు పరీక్షల ద్వారా నిర్ధరణ అయితే...సంబంధిత కరోనా నిఘా అధికారి ధ్రువీకరణ పత్రం జారీచేసిన అనంతరం కరోనా బాధితులు హోం ఐసోలేషన్ నుంచి బయటపడవచ్చు. ఇలా చేయటం ద్వారా కొవిడ్‌-19 బాధితులకు ఆందోళన తగ్గటంతో పాటు.. వైద్య సిబ్బందిపై కూడా ఒత్తిడి తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: రూ.50 కోట్ల పాత నోట్లున్నాయి..మార్చేందుకు అనుమతివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.