హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి శుభవార్త. గుండె గతిశక్తిని ఎలక్ట్రిక్ శక్తిగా మార్చే చిన్న పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా కొంత జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.
చాలామంది పేస్ మేకర్స్, డీఫిబ్రిలేటర్స్ ద్వారా జీవితాన్ని గడిపేస్తున్నారు. వీరు ప్రతి 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అసౌకర్యంతో కూడింది. ఖరీదైంది కూడా.
హృదయంలోని కదలికలతో ఈ పరికరం రీఛార్జ్ అవుతుంది. అందువల్ల మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉండదు. శరీర భౌతికచర్యలతో కూడా దీనికి సంబంధం ఉండదు.
ఇది ఎంతో అనుగుణమైంది, తక్కువ బరువు ఉంటుందని శాస్త్రవేత్త లిన్ డాంగ్ తెలిపారు. ప్రస్తుత పేస్ మేకర్‌ను పోలి ఉండటమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. అందువల్ల పేస్ మేకర్‌ను దాని ప్రధాన తీగ గతిశక్తిని ఎలక్ట్రిక్ శక్తిగా మార్చి బ్యాటరీలను నిరంతరాయంగా ఛార్జ్ చేసే విధంగా మరింత మెరుగ్గా రూపొందించాలని వీరు ప్రతిపాదించారు.
ఇప్పటికే మొదటగా జంతువులపై విజయవంతంగా అధ్యయనం చేశామని శాస్త్రవేత్త జంగ్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.