స్వీడన్‌కి చెందిన ఉపాసల, స్వీడిష్ విశ్వవిద్యాలయాలు కలిసి నిర్వహించిన పరిశీలనలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు కూడా ఎక్కువ కాలం జీవించినట్లు స్పష్టమైంది. ఇందుకోసం వీళ్లు ఇరవై ఏళ్ల క్రితం గుండెజబ్బు బారినపడ్డ కొందరు వ్యక్తుల్ని ఎంపికచేసి, వాళ్లలో కుక్కల్ని పెంచుకునేవాళ్లనీ పెంచని వాళ్లనీ రెండు విభాగాలుగా చేసి వాళ్లు ఎంతకాలం జీవించారనేది అధ్యయనం చేశారు. అందులో కుక్కల్ని కలిగి ఉన్నవాళ్లలో మరణాల సంఖ్య 33 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఒంటరిగా జీవిస్తూ కుక్కల్ని పెంచుకునేవాళ్లలోనూ 15 శాతం మరణాల సంఖ్య తగ్గిందట. వీళ్లతో పోలిస్తే గుండెజబ్బు సోకిన వాళ్లలో శునక తోడు లేనివాళ్లు త్వరగా మరణించడం లేదా మళ్లీ ఆసుపత్రిలో చేరడం వంటివి ఎక్కువగా కనిపించాయట. అందుకే ఒంటరితనంతో బాధపడేవాళ్లతోబాటు హృద్రోగుల ఆయుష్షు పెరిగేందుకూ పెంపుడు కుక్కలు తోడ్పడతాయని పేర్కొంటున్నారు పరిశోధకులు.
ఇదీ చదవండి:ఆ బార్లను తయారు చేసుకుంటే చాలు!