ETV Bharat / lifestyle

అందుకే రోజుకి కనీసం ఓ కొబ్బరి బోండం తాగేయాలి! - lose weight tips

‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి’.. ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్‌నెస్‌ మంత్రమిది. అందుకోసం ఎన్నో రకాల డైట్స్, వర్కవుట్‌ ప్లాన్లు తమ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకుంటారు. అయితే రాత్రికి రాత్రే బరువు తగ్గాలనుకుని కొంత మంది విపరీతమైన వర్కవుట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలుసుకుందాం రండి..

fitness tips
fitness tips
author img

By

Published : Mar 3, 2021, 11:02 PM IST

బరువు తగ్గేందుకు కొంత మంది వేరొకరిని చూసి అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లనూ మార్చుకుంటుంటారు. అయితే వెయిట్‌ లాస్‌ వల్ల శరీరంలోని మార్పులు తట్టుకోవడానికి బాడీకి కొంచెం సమయం పడుతుందని, అలాంటప్పుడు తక్కువ సమయంలో బరువు తగ్గడమనేది అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా త్వరగా బరువు తగ్గడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

టీ, కాఫీ బదులు!

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలామంది టీనో, కాఫీనో తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు వీటిని దూరంగా ఉంచడం ఉత్తమం. ఉదయం నిద్ర లేవగానే శరీరంలోని వ్యవస్థలు పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అలాంటప్పుడు టీ, కాఫీలను తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్‌ ఎక్కువ మొత్తంలో కార్టిసాల్ (స్ట్రెస్‌ హార్మోన్‌)ను విడుదల చేస్తుంది. ఫలితంగా ఆ రోజంతా ఒత్తిడిగానే ఉంటుంది. ఇక కార్టిసాల్‌ అధిక స్థాయిలో ఉంటే గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులూ పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు భారీగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా సోంపు టీ లాంటి హెర్బల్‌ పానీయాలను తాగడం ఉత్తమం. అదీ నిద్ర లేచిన అరగంట లోపు తీసుకుంటే మరీ మంచిది.

అరగంటకొకసారైనా అటూ ఇటూ!

చాలామంది ఇంట్లో టీవీ చూస్తూ, ఆఫీస్‌లో పని చేస్తూ గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చుండిపోతుంటారు. అయితే ఇలా అధిక సమయం పాటు కూర్చోవడం వల్ల శరీరంలోని భారమంతా వెన్నెముకపై పడుతుంది. అది దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కనీసం అరగంటకొకసారైనా రెండు నిమిషాల పాటు కూర్చున్న చోటు నుంచి లేచి నాలుగడుగులు వేయాలి. బాల్కనీలో నిలబడి శరీరాన్ని స్ర్టెచ్‌ చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యామాయంతో పాటు పగటి పూట సాధ్యమైనంత ఎక్కువసేపు అటూ ఇటూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నిర్వహించిన ఓ రీసెర్చ్‌లో తేలింది. ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ర్రభావాలు ఉండవంటున్నారు.

మొబైల్‌/టీవీ చూస్తూ తినద్దు!

చాలామందికి మొబైల్‌/టీవీ చూస్తూ తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే విషయాలు అసలు పట్టించుకోం. కొందరైతే గంటల తరబడి టీవీ ముందే కూర్చొని అధిక మోతాదులో ఆహారం లాగించేస్తుంటారు. ఫలితంగా జీర్ణ సమస్యలు రావడంతో పాటు తొందరగా బరువు పెరిగే ప్రమాదముంది. కాబట్టి ఆకలేస్తే టీవీ ముందుకు ఆహారం తెచ్చుకోవడానికి బదులు మనమే ఆహారం వద్దకు వెళ్లడమో, డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని ఏకాగ్రతతో తినడమో చేయాలి. ఒక్కసారిగా టీవీ చూస్తూ తినడం మానేయమంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆ అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

నిద్రపోయే ముందు వీటికి దూరంగా ఉండండి!

ఎక్కువ మంది రాత్రుళ్లు మొబైల్‌ ఫోన్లు చూస్తూ నిద్రపోవాలన్నే సంగతే మర్చిపోతుంటారు. దీనికి ప్రధాన కారణం మొబైల్‌ ఫోన్‌ వెలుతురు. స్ర్కీన్‌పై కనిపించే నీలం, తెలుపు రంగు వెలుగు మెదడులో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేయకుండా నిలువరిస్తుంది. ఫలితంగా ఎంతసేపయినా నిద్రపట్టదు. కాబట్టి నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్లు, టీవీ ల్లాంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం ఉత్తమం. ఇక ఆహారం విషయంలోనూ చాలామంది తినగానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్రపోవడానికి కనీసం నాలుగు గంటల ముందు ఆహారం తీసుకోవడం ఉత్తమం.

బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవి తీసుకోండి!

ఉదయం పూట తీసుకునే ఆహారం మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవాలంటే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల బరువు పెరగడంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ‘రెడీ టు ఈట్‌’ వంటి పదార్థాలు కాకుండా పోషక విలువలు పుష్కలంగా ఉన్న పోహా, ఉప్మా వంటి సంప్రదాయ ఆహార పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి.

సో... చూశారుగా ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునే వారు ఏం చేయాలో? ఏం చేయకూడదో? మరి మీరు కూడా ఈ టిప్స్‌ను పాటించండి. ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా నాజూగ్గా మారండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.