ETV Bharat / lifestyle

Health benefits of Amla: ఉసిరి.. ఔషధ సిరి.. సర్వదోష హరిణి.!

author img

By

Published : Nov 28, 2021, 3:27 PM IST

‘సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ తినండి... రోగనిరోధకశక్తి పెరుగుతుంది’ కరోనా పుణ్యమా అని ఈ విషయం మాటలు సరిగ్గా రాని పసివాళ్ల నుంచి చదువురాని వృద్ధుల వరకూ అందరికీ నోటిమాటగా మారిపోయింది. అయితే ఆ విటమిన్‌ ఎక్కువగా ఉండే పండు ఏదీ అంటే మాత్రం నారింజ అనో, నిమ్మ అనో చెబుతారు. కానీ అందులో తొలి స్థానం మన ఉసిరి(Health benefits of Amla)(ఇండియన్‌ గూస్‌బెర్రీ)దే... దానికి సీజన్‌ ఇదే..!

Health benefits of Amla
ఉసిరి.. ఔషధ సిరి
Health benefits of Amla
ఔషధ సిరి

Health benefits of Amla: ప్రకృతిలో ఆరోగ్యఫలాలను అందించే చెట్లు ఎన్నో ఉన్నాయి. అయితే అటు ఆరోగ్యంతోపాటు ఇటు దైవ సమానంగా పూజలందుకునే చెట్లు కొన్నే ఉంటాయి. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటి ఉసిరి(Indian gooseberry). దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. కార్తిక మాస పూజలు, వ్రతాల్లో ఉసిరికి విశిష్ట స్థానం ఉంది. చెట్టును పూజించడంతో పాటు కాయలనూ దీపాలుగా వాడుతుంటారు. అప్పటినుంచీ మొదలైన ఉసిరి కాయలు వేసవి వరకూ కాస్తూనే ఉంటాయి. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరి ఎంతో ఉత్తమం అని చరక సంహిత పేర్కొంటోంది. ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. అందుకే ప్రతీ వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలయినా నాటాలని పెద్దవాళ్లు చెబుతారు. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లా లేదా ధాత్రీఫలం అని పిలుస్తారు.

చిగుళ్లూ ఆరోగ్యమే
మనకు తెలిసి ఉసిరిలో రెండు రకాలు... ఒకటి పుల్లని నేల ఉసిరి, మరొకటి తీపీ వగరూ పులుపూ కలగలిసినట్లుండే రాతి ఉసిరి. నేల ఉసిరిని నేరుగా తినడానికో పులిహోరకో వాడటంతోపాటు ఆ పొడిని దుస్తుల అద్దకాల్లోనూ వాడతారు. రాతి ఉసిరిలో వేరు నుంచి చిగురు వరకూ ప్రతీ భాగమూ ఔషధమే. దీని కొమ్మలు సన్నగా, ఆకులు చిన్నగా ఉంటాయి. ఓ దశలో చెట్టంతా మోడయిపోతుంది. కొన్నిరోజులకు ఆ కొమ్మలన్నీ లేత పసుపురంగులో కనిపిస్తే చిగురేయకుండానే పూసిందేమో అనుకుంటాం. కానీ అవే మెల్లగా ఆకులుగా విచ్చుకుంటాయి. పూలలా కనిపించే ఈ చిగుళ్లూ ఆరోగ్యమేనట. అవి కాస్త పెరిగాక లేతపచ్చ కలిసిన పసుపురంగులో పూత వస్తుంది. అది పిందె తొడిగి లేతాకుపచ్చ రంగు కాయగా మారుతుంది. ఈమధ్య కొందరు వ్యవసాయ నిపుణులు లేత గులాబీరంగు ఉసిరికాయల వంగడాన్నీ అభివృద్ధి చేయడం విశేషం.

పోషక సిరి!

Health benefits of Amla
విదేశాల ఉసిరి
అరటిపండు, ఆపిల్‌ పండు మాదిరిగా ఉసిరికాయను కొరికి తినడం కష్టమే... ఎందుకంటే పులుపు(health benefits of amla in telugu) దీని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలాలతో పోలిస్తే ఉసిరిలో విటమిన్‌-సి 20 రెట్లు ఎక్కువ. ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ప్రొటీన్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. మొత్తంగా అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని ‘సర్వదోషహర’ అనీ పిలుస్తారు. ఈ కాయలను ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. తాజా వాటితో పచ్చడి, పులిహోర... వంటివి చేయడంతోపాటు మురబ్బా రూపంలో పంచదార పాకంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే. కానీ వీలైనంత వరకూ వాటిల్లో పంచదారా ఉప్పూ బాగా తగ్గించి తినాలి. అలాగే ఉసిరికాయలతో రైతాలానూ చేసుకోవచ్చు.

వంద గ్రాముల రాతి ఉసిరిలో 80 శాతం నీరు, కొద్దిపాళ్లలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు, పీచూ లభిస్తాయి. 470- 680 మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి. ఇతర పండ్లలో మాదిరిగానే ఇందులో పీచూ ఎక్కువే.

ఉసిరి నీడలో రుచుల విందులు!

ఆరోగ్య సిరి..!
ఉసిరి త్రిదోషహరిణి అంటోంది ఆయుర్వేదం(benefits of amla in telugu). అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుందట. అందుకే అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌ తయారీకి ఆమ్లానే ప్రధానం. పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ... వంటివన్నీ తగ్గుతాయని చెబుతారు సంప్రదాయ వైద్యులు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవాళ్లు రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, తేనె కలిపి పేస్టులా చేసుకుని రోజుకి రెండుమూడుసార్లుగా తింటే చాలావరకూ తగ్గుతుందట. ఇతరత్రా ఇన్ఫెక్షన్లనూ ఇది తగ్గిస్తుంది. అందుకే ఫ్లూ తరహా జ్వరాల నివారణకు ఉసిరి ఉత్తమోత్తమ ఔషధం.

  • తిన్నది ఒంటికి పట్టేలా చేయడంలోనూ దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యలనూ నివారిస్తుందని.. భోజనం తరవాత తింటే మరీ మంచిదనీ అంటారు. ఇది జీవక్రియను పెంచడంతోపాటు ఇందులోని పీచు ఆకలినీ తగ్గిస్తుంది. దాంతో ఊబకాయాన్నీ అడ్డుకోవచ్చు. మలబద్ధకం కూడా ఉండదు.
  • కాలేయ వ్యాధులకు ఉసిరి దివ్య ఔషధం. శరీరంలోని విషతుల్యాలనూ తొలగిస్తుంది. డయేరియా డీసెంట్రీలనీ ఉసిరి తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని తద్వారా జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. నెలసరి సమస్యలను తగ్గించి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందని.. వీర్యసమృద్ధికీ తోడ్పడుతుందని చెబుతారు.
  • ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదట. రోజూ ఓ ఉసిరికాయని తింటే కఫ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకు ఉసిరి మంచిదన్న కారణంతో దీన్ని చక్షు క్షయ అనీ పిలుస్తారు. ఉసిరికాయలను ముద్దగా చేసి తలకు పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్‌ కారణంగా కణాలు దెబ్బతినకుండా చేయడంతో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది.

యాంటీ వైరల్​
ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ సైతం ఉసిరిని ఔషధ సిరి అని పొగుడుతోంది. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌ గుణాలు అధికంగా ఉన్నాయని.. ఇది రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందని గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ చెబుతోంది. ఇందులో ఉండే క్రోమియం.. ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచడం ద్వారా చక్కెర నిల్వలను తగ్గించి హృద్రోగాలు, మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందని తేలిందట. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయట. ఎలా చూసినా ఉసిరిలో రోగనిరోధకశక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.

సౌందర్యలహరి!
కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో పాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలు, నూనెలు జుట్టుకి మంచివే. ఇవి బాల నెరుపును, చుండ్రును తగ్గిస్తాయి. ఆ కారణంతోనే ఈ మధ్య హెయిర్‌ఆయిల్స్‌లో ఉసిరిని విరివిగా వాడుతున్నారు. అలాగే ఇందులోని సి-విటమిన్‌ ఎండ నుంచి, చర్మరోగాల నుంచి కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపును ఇస్తుంది. రోజూ ఓ ఉసిరికాయను తింటే కాల్షియం శోషణ పెరుగుతుంది. దాంతో ఎముకలు, దంతాలు, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి, తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్‌గా లేదా పొడి రూపంలో- ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించే అద్భుత ఔషధ సిరి..!

ఉసిరి కాని ఉసిరి!
గూస్‌బెర్రీ... ఇవి ఉసిరికాయలను తలపిస్తాయి. కానీ ఉసిరి కాదు. వీటిని యూరోపియన్‌ గూస్‌బెర్రీ అంటారు. వీటిని అలా పిలవడంవల్లే మన ఉసిరి (ఆమ్లా)ని ‘ఇండియన్‌ గూస్‌బెర్రీ’ అని ప్రత్యేకంగా పిలుస్తారు పాశ్చాత్యులు. చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ ఈ ఐరోపా గూస్‌బెర్రీలు, పొదలకు కాస్తాయి. ఆకుపచ్చ రంగుతో పాటు ఎరుపు, ఊదా, పసుపు, తెలుపు... ఇలా వేర్వేరు రంగుల్లోనూ ఉంటాయి. ఐరోపా, పశ్చిమాసియా దేశాలతో పాటు ఉత్తర భారతదేశంలోనూ హిమాలయశ్రేణుల్లోనూ ఇవి ఎక్కువగా పెరుగుతాయి. చిత్రంగా వీటితోనూ నిల్వ పచ్చళ్లు పడతారు. మురబ్బా తయారుచేస్తారు. ఎండబెట్టీ తింటారు. జామ్‌లు చేస్తారు. జ్యూస్‌ రూపంలో తాగుతారు. ఇతరత్రా పోషకాలు ఉసిరిలో మాదిరిగానే ఉన్నప్పటికీ సి-విటమిన్‌ శాతం మాత్రం గూస్‌బెర్రీలో తక్కువ. కానీ నిమ్మ, నారింజలతో పోలిస్తే ఎక్కువే. ఎ-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉండటంతో ఇవి కళ్ల సమస్యలను తగ్గిస్తాయి. పైగా ఇందులోని ఫైటో కెమికల్సు, ఆంథోసైనిన్లు, బీపీ, హృద్రోగాలు, మధుమేహం నియంత్రణకు తోడ్పడతాయి. జీర్ణశక్తిని పెంచి, బరువును తగ్గిస్తాయి. వీటిని టీ లేదా జ్యూస్‌ రూపంలో తాగితే జలుబు, ఫ్లూ జ్వరాలకు ఉపశమనం లభిస్తుంది. అందుకే ఉసిరిలానే ఇదీ అద్భుతమైన ఓషధీఫలమే!

ఇదీ చదవండి:

తినాలనే కోరిక తగ్గాలంటే.. ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.