ETV Bharat / lifestyle

కరోనా వేళ వ్యాధి నిరోధకశక్తి కోసం తినండి.. మునగాకు! - మునగాకు ఉపయోగాలు

వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబూ, దగ్గులాంటి ఇబ్బందుల నుంచీ బయటపడవచ్చు. మునగాకు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో చూడండి...

drumstick-leaves-benefits-for-health
మునగాకుతో ఉపయోగాలు
author img

By

Published : Jul 5, 2020, 11:24 AM IST

మునగాకుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఇది ఎంతో మేలు చేస్తుంది.

  • పాలకూరతో పోలిస్తే దీంట్లో 3 రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండులో కంటే 7 రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే 2 రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.
  • మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
  • శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంటాయి.
  • మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది..
  • ఈ ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
  • ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.

ఇవీ చదవండి..

పిల్లలకు ల్యాపీలిద్దాం.. సెల్‌ఫోన్‌ కంటే ఇదే మేలేమో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.