2019 లోక్‌సభ ఎన్నికల్లో నకిలీ వార్తలు విపరీతంగా హల్చల్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. పుకార్లను షేర్ చేసే విషయంలో ప్రపంచవ్యాప్త సగటు కన్నా మనమే ముందున్నాం. ఇరవై రెండు దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారతీయులు వ్యాప్తి చేస్తోన్న నకిలీ వార్తలు 64 శాతం ఉంటే... ప్రపంచ సగటు 57 శాతమే ఉందట. అంతర్జాలం ద్వారా ఎదురయ్యే సమస్యలు గతంలో 20శాతం ఉండగా తాజాగా 9 శాతం పెరిగి 29కి చేరింది. భారత్‌లో సామాజిక బంధాలతో ఇబ్బందులు మరింత పెరగనున్నట్లు వెల్లడించిందీ సర్వే.
అంతర్జాలంతో సతమతమవుతున్న వారి సంఖ్య భారత్‌లో 52 శాతానికి చేరింది. ఇది ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. నిద్రలేమితో బాధ పడేవారి సంఖ్య సైతం ప్రతి ఏడాది పెరుగుతోందని హెచ్చరించారు. ఆన్‌లైన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... పరిష్కారం కోసం మళ్లీ ఇంటర్నెట్నే ఆశ్రయిస్తున్నారనే ఆసక్తికర అంశాన్నీ వెల్లడించింది.