ETV Bharat / lifestyle

మనసుకు నచ్చిన కళను... వ్యాపార మంత్రంగా మార్చుకుని.. - ఫైన్​ ఆర్ట్స్​

జీవితం ఎవరికీ పూల బాట కాదు... దారిలోని ముళ్లను ఏరేస్తూ.... గమ్యాన్ని ఏర్పరుచుకోవాల్సిన బాధ్యత మనదే అంటోంది హైదరాబాద్‌కి చెందిన సింధు శ్రీరాం. అందుకే అనారోగ్యం, మానసిక కుంగుబాటుని అధిగమించేందుకు తన మనసుకి నచ్చిన కళను ఆయుధంగా మలుచుకుంది. దాన్నే వ్యాపార మంత్రంగా మార్చుకుని దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

sindhu sriram successful story
సింధు శ్రీరాం
author img

By

Published : Sep 2, 2021, 3:45 PM IST

చిన్నప్పటి నుంచీ ఏ పని చేసినా వైవిధ్యంగా ఉండాలని కోరుకునేదాన్ని. అందుకే ఇంజినీరింగ్‌నో, మెడిసిన్‌ కాకుండా జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ చేశా. ఈ విషయంలో చాలా మంది నన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నించారు. కానీ నాకు ఆర్ట్స్‌పై ఆసక్తి ఏర్పడటానికో కారణం ఉంది. చిన్నప్పుడు లెక్కలంటే ఇష్టం లేక... వెనుక బెంచీలో కూర్చుని బొమ్మలు గీసేదాన్ని. ఆ అభిరుచి నాతో పాటే పెరిగి పెద్దదయ్యింది. దీనికి తోడు మా అన్నయ్య ఫైన్‌ ఆర్ట్స్‌ చదివి విదేశాల్లో వీడియో గేమింగ్‌ సంస్థ ప్రారంభించి బాగా స్థిరపడ్డాడు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. చదువయ్యాక రెండేళ్లు పలు ఉద్యోగాలు చేశా. తర్వాత పెళ్లి కావడంతో మానేశా.

అనారోగ్య సమస్యలతో...

కొన్నాళ్లయ్యాక అనారోగ్యం, జీవితంలో కొన్ని ఒడుదొడుకులు. అవి నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. కుంగుబాటుకి గురయ్యా. ఉపశమనం కోసం కొన్నాళ్లు ఉండొద్దామని అమెరికా వెళ్లా. అక్కడే ఓ భారతీయ మహిళను రోడ్డుపై దీన స్థితిలో చూశా. నడుముకి చంటి పిల్లాడిని కట్టుకుని అడుక్కుంటోంది. దేశం కాని దేశంలో ఆమెకి ఆ స్థితి ఎందుకొచ్చిందో తెలియదు. అప్పుడు కనీసం తన దగ్గరికి కూడా వెళ్లలేకపోయా. ఏ సాయమూ చేయలేకపోయా. కానీ ఆ సంఘటన నాపై చెరగని ముద్రవేసింది. ఆలోచిస్తే... నా కంటే పెద్ద సమస్యలతో బాధపడే వారు చాలామంది ఉన్నారని అర్థమైంది. అందుకే నా ఇబ్బందుల్ని నిబ్బరంతో అధిగమించాలని నాకు నేనే చెప్పుకొన్నా. ఇందుకు మనసుకి నచ్చిన పనులపై దృష్టి పెట్టాలనుకున్నా.

సేంద్రియ కానుకలు...

ఇండియా వచ్చాక ఏం చేద్దామా అని చాలా ఆలోచనలు చేశా. ఎన్నో వ్యాపారాలను అధ్యయనం చేశా. అవేవీ నన్ను మెప్పించలేకపోయాయి. అప్పటికి పెద్ద మొత్తం పెట్టుబడిగా పెట్టే పరిస్థితి కూడా లేదు. ఇక నా ఆర్ట్‌వర్క్‌తోనే ఉపాధిని సృష్టించుకోవాలనుకున్నా. నా దగ్గర ఉన్న ఇరవై అయిదు వందల రూపాయల్నే పెట్టుబడిగా పెట్టి... పిల్లలకు వర్క్‌షాప్‌లు నిర్వహించేదాన్ని. కూరగాయలు, పండ్ల నుంచి రంగుల్ని తీయడం, బొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీ వంటివెన్నో నేర్పేదాన్ని. మొదటి క్లాసు తర్వాత చూస్తే ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి. తిరిగి ఆ మొత్తాన్నే వినియోగిస్తూ మరిన్ని తరగతులు చెప్పా. ఇలా కొన్నాళ్లు సాగింది. అప్పుడే నేను చేసే కళాకృతుల్ని చూసిన వారంతా మాకూ అలా చేసివ్వమని అడిగేవారు. ఓ సారి నా స్నేహితురాలు రిటర్న్‌ గిఫ్ట్‌లు చేసిమ్మని ఆర్డరు ఇచ్చింది. ఉత్సాహంగా చేసిచ్చా. వారికి బాగా నచ్చాయవి. అది మొదలు ఇక వెనుతిరిగి చూడలేదు. వినియోగదారుల సందర్భానికి, నా సృజనను చేర్చి... యునిక్‌ కలెక్షన్‌ని తీసుకురావడం మొదలుపెట్టా. ఆ నోటా ఈ నోటా బాగా ప్రచారమై ఆర్డర్లు పెరిగాయి. నా ప్రత్యేకతను చాటేలా పర్యావరణహిత, సేంద్రియ ఉత్పత్తులతో కస్టమైజ్డ్‌ గిఫ్ట్స్‌, హ్యాంపర్లు చేసివ్వడం మొదలుపెట్టా. నా వ్యాపారానికి వ్యవస్థాగత రూపం ఇవ్వాలని ‘మనోవాంఛ’ సంస్థను రిజిస్టర్‌ చేయించా.

దివ్యాంగులకు ఉపాధి...

నేను కాస్త స్థిరపడితే నా వ్యాపారంలో దివ్యాంగులు, అనాథాశ్రమ చిన్నారులు, ఒంటరి, వితంతు మహిళలకు ఉపాధి కల్పించాలనుకునేదాన్ని. అలానే చేస్తున్నా. చాలా ఏళ్లు వారికి వాహన, భోజన సదుపాయం కల్పించి మరీ పని కల్పించేదాన్ని. కరోనా వల్ల మారిన పరిస్థితులతో దీనికి కొంత ఆటంకం కలిగింది. అయినా భవిష్యత్తులో మళ్లీ ఆ పద్ధతుల్ని అమలు చేస్తాం. ఇక, మేం అందించే రిటర్న్‌ గిఫ్ట్స్‌, గిఫ్ట్‌ హ్యాంపర్ల డిజైన్‌, కూర్పు వంటివన్నీ నా ఊహకు అనుగుణంగా తయారు చేయించేవే. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల కళాకారులు, వెండార్ల నుంచి ముడిసరకు తెప్పించుకుంటా. బేబీ షవర్‌ నుంచి పెళ్లి వరకూ అన్ని సందర్భాలకూ పనిచేస్తాం. కస్టమర్‌ అవసరాన్ని తెలుసుకుని వారి అభిరుచికి మా సృజనను జోడించి వివిధ రకాల కళారూపాలు, అలంకరణ వస్తువులు, కానుకలు రూపొందిస్తాం. వీటిని అందించే బుట్టలు, బ్యాగులు.. వంటివీ యునిక్‌గా ఉండేలా చూస్తాం.

వస్త్రం, వెండి, బంగారం వంటి విలువైన లోహాలతోనూ కస్టమైజ్డ్‌ గిఫ్ట్‌లు చేస్తాం. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీతారలెందరో మాకు ఖాతాదారులు. ఆ మధ్య నటి సమంతకోసం రూపొందించిన దశావతారాల అద్దం నేనెంతో ఇష్టంగా తయారు చేసిన కానుక. తాజాగా ఓ మార్వాడీ కుటుంబ పెళ్లి కోసం ఒక్కోటీ పాతిక వేలు విలువ చేసేలా ఐదొందల గిఫ్ట్‌ హ్యాంపర్లు అందించాం. ఇలా ఆర్డరును బట్టి ఐదువందల రూపాయల నుంచి లక్షల రూపాయలు విలువ చేసే కానుకలను డిజైన్‌ చేస్తాం. ఆర్డర్‌ని బట్టి పది నుంచి ముప్పై మంది మా దగ్గర పనిచేస్తుంటారు. మాది నల్గొండ జిల్లా అయినా పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. అత్తింటివారిది వరంగల్‌. మామయ్య శ్రీరాం భద్రయ్య, మాజీ ఎమ్మెల్యే, మా వారు శ్రీరాం భరత్‌... రాజకీయాల నుంచి వ్యాపారంలోకి వచ్చారు. నా ప్రయాణంలో ఆయనే నాకు కొండంత అండ. మాకో అబ్బాయి ఆర్య.

ఇదీ చూడండి:

C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.