ETV Bharat / lifestyle

నల్ల చిరుత ఫొటో వెనుక ఉంది అతనే - man behind the black panther photos

భారీ చెట్లు.. వాటిని ఆవరించిన పొగమంచు.. దాన్ని చీల్చుకొస్తున్న సూర్యకిరణాల్లో నల్లగా నిగనిగలాడుతూ ఠీవిగా నడిచి వెళ్తున్న ఓ చిరుత! ఆకు చాటు నుంచీ, చెట్టు మరుగు నుంచీ భయంగొలిపే కళ్లతో చూస్తూ దాగుడుమూతలాడుతున్నట్లు మళ్లీ అదే నల్ల చిరుత! ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోల వెనుక ఓ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఐదేళ్ల కష్టం ఉంది. కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాలదన్ని, తన అభిరుచి కోసం అడవి బాట పట్టిన తెగువుంది. అతని పేరు షాజ్‌ జంగ్‌!

wild life photographer shaaz jung
నల్ల చిరుత ఫొటో వెనుక ఉంది అతనే
author img

By

Published : Jul 19, 2020, 5:52 PM IST

Updated : Jul 19, 2020, 6:43 PM IST

భోపాల్‌లోని పఠౌడీ, హైదరాబాదులోని పైఘా రాజ కుటుంబాల నుంచి వచ్చాడు షాజ్‌ జంగ్‌. తండ్రి సాద్‌ బిన్‌ జంగ్‌ టీమిండియా మాజీ క్రికెటర్‌. తల్లి సంగీత. అమ్మానాన్నలిద్దరూ పర్యావరణ ప్రేమికులు. కర్ణాటకలో ఎకోటూరిజం అభివృద్ధిలో వీరి పాత్ర ప్రముఖమైంది. అలా సహజంగానే ప్రకృతి, వన్యప్రాణులపై మక్కువ పెంచుకున్నాడు షాజ్‌. ఐరోపాలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసిన షాజ్‌ కార్పొరేట్‌ కొలువుల్ని కాదని పదేళ్ల కిందట తిరిగి వచ్చేశాడు. కర్ణాటకలోని నాగరహొలె జాతీయ పార్కులో కబిని రిజర్వాయర్‌ ఒడ్డున పర్యావరణ హిత ‘బైసన్‌ రిసార్ట్‌’ ఏర్పాటులో అమ్మానాన్నలకు సహకరించాడు.

నల్ల చిరుత
నల్ల చిరుత
నల్ల చిరుత
నల్ల చిరుత

చిరుత పులల మీద అధ్యయనంలో భాగంగా ఫొటోలు తీయడం ప్రారంభించిన షాజ్‌కు రాన్రానూ అదే లోకంగా మారింది. ఈ క్రమంలో కబిని అడవిలో తిరుగుతున్న నల్ల చిరుత ‘సాయా’ మీద దృష్టి పడింది. నల్ల చిరుతలు సతత హరితారణ్యాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. కానీ, కబిని లాంటి ఆకురాలే అడవుల్లో ‘సాయా’ జీవన విధానాన్ని పరిశీలించాలని షాజ్‌కు ఆసక్తి కలిగింది. అలా దాని గుట్లుమట్లు తెలుసుకు నేందుకు అయిదేళ్ల సమయం వెచ్చించాడు. రోజూ ఉదయం ఆరింటికి కెమెరా భుజాన వేసుకుని ‘సాయా’ను వెతుకుతూ, కనిపిస్తే దాని వెంట తిరుగుతూ సాయంత్రం ఆరున్నర వరకు గడిపేవాడు. వారంలో కనీసం రెండు సార్లైనా అది కనిపిస్తే అదే పెద్ద అదృష్టమనుకున్నాడు. తన కష్టం ఫలించి నల్ల చిరుత నయనానంద కరంగా కెమెరా కంటికి చిక్కింది. ఇటీవల ట్విటర్‌ హ్యాండిల్‌ ‘ఎర్త్‌’ ఈ ఫొటోల్ని షేర్‌ చెయ్యడంతో వెంటనే వైరల్‌ అయ్యాయి. చాలా మంది దీన్ని ‘జంగిల్‌బుక్‌’లోని బఘీరాతో పోల్చారు. వీటిని చూసి షాజ్‌ సమీప బంధువు, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫోను చేశారట. ‘సాయా’ గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉందన్నది షాజ్‌ మాట.

షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ

సేవలోనూ ముందంజ

ప్రస్తుతం ‘బైసన్‌ రిసార్టు’ నడుపుతున్న షాజ్‌, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌, గైడ్‌గానూ పనిచేస్తున్నాడు. నల్ల చిరుత మీద నేషనల్‌ జాగ్రఫిక్‌ ఛానల్‌ తీసిన చిత్రానికి తనే డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల షాజ్‌ చిత్రప్రదర్శనలు జరుగుతున్నాయి. ‘పర్యావరణ అధివాస్తవికత’ పేరుతో ఫైన్‌ ఆర్ట్‌కి ఫొటోగ్రఫీని జోడించి వెలుగు నీడల్లో షాజ్‌ రూపొందించిన అనేక ఫొటోలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆఫ్రికాలోని టాంజానియాలో కూడా షాజ్‌ కుటుంబం వైల్డ్‌లైఫ్‌ క్యాంపులు నడుపుతోంది. ఇక్కడి జీవ వైవిధ్యం, ప్రజల జీవన విధానం మీద కూడా చక్కటి ఫొటోలు తీశాడు. వైల్డ్‌ లైఫ్‌ గురించి షాజ్‌ రాసిన వ్యాసాలు, తీసిన ఫొటోలు పలు మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

ఇవేకాదు, సమాజ సేవలోనూ ముందుంటాడు షాజ్‌. సమీప గ్రామంలో నీటి ఎద్దడిని గుర్తించి బోరుబావి తవ్వించాడు. మైసూరు జిల్లాలో నలుగురు గ్రామీణ విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాల్లో చదివిస్తున్నాడు. గిరిజనులకు వేసవిలో నీరు అందిస్తున్నాడు. స్థానిక ప్రజలకు కంబళ్లు, రెయిన్‌ కోట్లు, బూట్లు, బట్టలు సమకూరుస్తున్నాడు. దగ్గరలోని బడులకు కంప్యూటర్లూ అందిస్తున్నాడు. బఫర్‌ రీజియన్ల పరిధిలో నెలకొనే వివాదాలను పరిష్కరించేందుకు ‘ద బఫర్‌ కాన్‌ఫ్లిక్ట్‌ రిజల్యూషన్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు చేశాడు. చిరుతపులుల అధ్యయనం కోసం దీని ద్వారా ‘ప్రాజెక్ట్‌ పార్దస్‌’ను ప్రారంభించాడు. ‘‘అడవి నాకు సహనాన్ని నేర్పింది. ప్రతి క్షణాన్ని ఆనందంగా ఎలా గడపాలో అందులోని ప్రాణులు నాకు తెలియజెప్పాయి. అవే నా మెంటార్లు. నేనేం చేసినా ప్రకృతి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే నా ధ్యేయం’’ అంటాడు. ఫలితాల కోసం ఆశించకుండా నచ్చిన పనిని ప్రాణంపెట్టి చేసుకెళ్లేవాళ్లెప్పుడూ విజయశిఖరాలను ముద్దాడతారు.. అచ్చం షాజ్‌లా!

షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ
షాజ్‌ జంగ్ ఫొటోగ్రఫీ

ఇదీ చూడండి : 'సల్మాన్​ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'

Last Updated : Jul 19, 2020, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.