ఆరు నెలల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో కూలిపోయిన 20 ఏళ్ల నాటి వృక్షాన్ని పాదచారులు తిరిగి నిలబెట్టారు. గతేడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కేబీఆర్ పార్కులో నడక దారిలో ఉన్న భారీ వృక్షం వేర్లతో సహా పడిపోయింది. ఈ మధ్య కాలంలో చెట్టు చిగురించడంతో ఆ దారిలో నడిచే వాకర్లు చెట్టును తమ సొంత ఖర్చులతో తిరిగి నిలబెట్టారు. పార్కులో ప్రతి రోజు వాకింగ్‌కు వచ్చే వారికి ఆక్సిజన్‌ను పంచిన చెట్టును నిలబెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాదచారులు తెలిపారు.
ఇదీ చదవండి: విమానాశ్రయం లాంటి హంగులతో గుంతకల్ రైల్వే స్టేషన్