ETV Bharat / jagte-raho

ఆశపడ్డారో.. అప్పులపాలౌతారు

అరనిమిషంలో అరకోటైనా పొందవచ్చు. కానీ అర సెకను ఆలస్యమైన ఇక అంతే సంగతులు ఇవి ఆన్​లైన్​ రుణ యాప్​ల నిబంధనలు. అవసరానికి డబ్బు అందించి.. ఆ తర్వాత వసూళులో చుక్కలు చూపిస్తారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో యువత ఈ ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరైనా లోన్‌ కావాలనుకుంటే ముందే పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైతేనే లోన్​ తీసుకోవాలని సైబర్​ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

youth commit suicides due to online loans
ఆన్​లైన్ అప్పులు
author img

By

Published : Dec 22, 2020, 3:54 PM IST

సామాజిక మాధ్యమాల్లో అప్పిస్తామంటూ వచ్చే ప్రకటనలకు ఆశపడి ఇరుక్కుంటున్న యవత డబ్బులు చెల్లించలేక బలవర్మరణానికి పాల్పడుతున్నారు. అవసరానికి డబ్బు అందింది అనే ఆలోచనలోపే ఎలా చెల్లించాలని కలవరపడుతున్నారు. దీంతో క్షణికావేశానికై లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

వేధింపులు ఎక్కువై పోలీసులను ఆశ్రయించి..

కానూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ చూస్తుండగా.. ‘ఆధార్‌, పాన్‌ కార్డు ఉంటే చాలు.. మీ ఖాతాలో నగదు జమ చేస్తాం.’ అనే ప్రకటన కనిపించింది. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తర్వాత ఆధార్‌, పాన్‌ వివరాలు ఇచ్చి. రూ.2 వేలు రుణం తీసుకుని వడ్డీతో సహా కట్టేసేంది. తర్వాత ఇలా దాదాపు 70 యాప్‌ల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంది. ఇదంతా ఆమె తల్లిదండ్రులకు తెలియదు. ఇప్పటి వరకు రూ.2లక్షలు కట్టినా ఆమె బాకీ తీరలేదు. దీంతో యాప్‌ ప్రతినిధుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. మానసిక క్షోభకు గురై చివరకు పోలీసులను ఆశ్రయించింది.

విజయవాడకు చెందిన ఓ కార్‌ డ్రైవర్‌.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడంతో స్నేహితులను అప్పు అడిగాడు. వారి సలహా మేరకు ఆన్‌లైన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని లోన్లు తీసుకున్నాడు. మొదట రూ.4 వేలు తీసుకుని దాన్ని చెల్లించేందుకు మరొక యాప్‌లో రుణం తీసుకున్నాడు. ఈ విధంగా 15 యాప్‌ల్లో మొత్తం రూ.50 వేలు తీసుకున్నాడు. ఐదు నెలల్లో రూ.4 లక్షలు కట్టినా.. ఇంకా బాకీ తీరలేదు. ఒక్క రోజు ఆలస్యమైందని యాప్‌ ప్రతినిధి బాధితుడి ఫొటోను వాట్సాప్‌లో ఉంచి.. అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అతని కాంటాక్ట్‌లో ఉన్న సోదరి ఫొటోను కూడా వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టి.. వేధించాడు. దీంతో బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

వడ్డీని ముందే తీసుకుంటారు..!

అవును మీరు విన్నది నిజమే ఇది వడ్డీ ముందే తీసుకుని.. మిగతాది ఖాతాలో జమ చేస్తారు. ఉదాహరణకు రూ.7 వేలు లోన్‌ తీసుకుంటే.. రూ.5,800 మాత్రమే ఇస్తారు. వారం రోజుల్లో రూ.8,100 జమ చేయాలి. లేకపోతే వేధింపులు మొదలవుతాయి. ఆయా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడే ఫోన్‌లోని కుటుంబసభ్యులు, మిత్రుల ఫోన్‌ నంబర్లు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని నిర్వాహకులు సేకరిస్తున్నారు. రుణాలపై ఏకంగా 32-42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు జమ చేయకుంటే ఫోన్‌లోని కుటుంబసభ్యులు, మిత్రుల ఫోన్‌ నంబర్ల ద్వారా.. నగదు జమచేసే వరకు అసభ్యంగా మాట్లాడతారు. ఫొటోలపై మోసగాడు, దొంగ అని ముద్ర వేసి సామాజిక మాధ్యమాల్లో పెడతారు. ఆ తర్వాత.. బంధువుల ఫొటోలపై అసభ్యంగా కామెంట్స్‌ రాసి పోస్టు చేస్తున్నారు. ఇవి తట్టుకోలేక లోన్‌ తీర్చేందుకు బాధితులు మరో యాప్‌ను ఆశ్రయించి.. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.

విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఈ విధంగా మోసపోయిన వారు వందల్లో ఉన్నా.. గడిచిన నాలుగు నెలల్లో 20 మంది ఫిర్యాదు చేశారు. వీటన్నింటికీ సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇలా రుణాలు తీసుకున్న కొందరు సున్నిత మనస్కులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

విజయవాడ కేంద్రంగా పలు సంస్థలు దందాను నడుపుతున్నాయి. ఇప్పటి వరకు మా దృష్టికి 20 ఫిర్యాదులు వచ్చాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పని చేస్తున్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నాం. వేధింపులకు సంబంధించి లోన్‌ యాప్‌ నిర్వాహకులకు మెయిల్స్‌ పంపించాం. అలా చేయొద్దని.. చట్ట ప్రకారం నగదు వసూలు చేసుకోవాలని తెలిపాం. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా లోన్‌ కావాలనుకుంటే ముందే పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైతేనే లోన్​ తీసుకోవాలి.

- కె.శ్రీనివాసరావు, సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌

ఇదీ చదవండి:

మైక్రోఫైనాన్స్‌ యాప్​ల వేధింపులు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.