ETV Bharat / jagte-raho

తెలంగాణ: అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్ - వికారాబాద్​లో యువతి అపహరణ

అందరూ చూస్తుండగానే యువతిని అపహరించిన ఘటన... తెలంగాణలోని వికారాబాద్​ ఎంఆర్​పీ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.

young-girl-kidnapped-in-vikarabad
అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్
author img

By

Published : Sep 27, 2020, 11:47 PM IST

తెలంగాణలోని వికారాబాద్ పట్టణానికి చెందిన దీపిక, అఖిల్​... 2016లో ఆర్యసమాజ్​లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్ల రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం నాడు ఇద్దరూ వికారాబాద్​ కోర్టుకు హాజరయ్యారు.

ఆదివారం సాయంత్రం సోదరితో కలిసి షాపింగ్​కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా... భర్త, మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి దీపికను లాక్కొని వెళ్లారు. దీపిక కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు సిబ్బందితో కలిసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

అల్లు అర్జున్ స్ఫూర్తితో బాలీవుడ్​ బ్యూటీ డ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.