ETV Bharat / jagte-raho

టైల్ కటింగ్ చేస్తూ యువకుడు మృతి - taja death news in viskaha dst

ఇంట్లో టైల్ కటింగ్ చేస్తుండగా బ్లేడ్ మెడకు తగిలి ఓ యువకుడు మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి విద్యుత్ నగర్​లో జరిగింది. విషయం తెలిసి మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

worker died in viskaha dst due to tailcutting in a house

author img

By

Published : Jul 21, 2020, 8:06 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని విద్యుత్​నగర్​లో ఇంట్లో టైల్ కటింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మాడుగుల మండలం ముకుంద పురం గ్రామనికి చెందిన బి. సతీష్ (27) ఇంటి నిర్మాణం పనిలో కూలీగా పనిచేస్తుంటాడు. వాల్ కటింగ్ బ్లేడ్​తో టైల్ కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్లేడ్ సతీష్ మెడకి తగిలింది. తీవ్ర రక్త స్రావం అవ్వటంతో విశాఖపట్నం కేజీహెచ్​కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సతీష్​కి భార్య ఉషా దేవి, రెండేళ్ల కుమార్తె, ఆరు నెలల బాబు ఉన్నాడు. భర్తమృతితో ఉషాదేవి రోదనలు మిన్నంటాయి. అనకాపల్లిపట్టణ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

మంత్రివర్గంలోకి వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.