ETV Bharat / jagte-raho

రెండేళ్ల కొడుకుతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

కుటుంబ కలహాలతో ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించింది. తన రెండేళ్ల కొడుకు ముఖం చూసికూడా ఆ తల్లి మనసు కరగలేదు. ఆత్మహత్యే శరణ్యమనుకుని చిన్నారితోపాటు తానూ.. ఓ పాడుబడ్డ బావిలో దూకి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

vikarabad telangana sate
vikarabad telangana sate
author img

By

Published : Jan 2, 2021, 8:19 PM IST

కుటుంబ కలహాలతో 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన రోహిణి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల తన కొడుకుతోపాటు బావిలో దూకి చనిపోయింది.

భర్తతో గొడవ పడి..

తెలంగాణలోని వికారాబాద్ మండలం అత్తేల్లి గ్రామానికి చెందిన మిట్టకోడూర్​కి చెందిన రోహిణికి మూడు సంవత్సరాల క్రితం పరిగి మండలం బర్కత్​పల్లి గ్రామానికి చెందిన ఆశోక్​తో వివాహం జరిగింది. గత నెల 28న అత్తేల్లి గ్రామంలో జాతరకు భార్యభర్తలిద్దరు కలిసి వెళ్లారు. అప్పటికే అక్కతో గొడవ పడిన రోహిణి జాతరలో భర్తతో గొడవ పడి.. రెండేళ్ల కొడకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు భార్య, కుమారుడు కనిపించడం లేదంటూ అశోక్ వికారాబాద్ పోలీస్​లకు ఫిర్యాదు చేశాడు.

సకాలంలో స్పందించనందునే..

ఓ పాడుబడ్డ బావిలో మృతదేహాలని గుర్తుంచిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదురోజులు గడుస్తున్నా సకాలంలో స్పందించని కారణంగానే ఈ ఘోరం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి విచా‌రణ చేపట్టి ఉంటే ప్రాణాలతో బయటపడే వారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

సీఎం విజయనగరం వచ్చినా.. రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.