తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటుచేసుకొంది. వివాహిత ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.భువనగిరికి చెందిన బాలు, జనగామ జిల్లావాసి శిల్పకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మిర్యాలగూడలో బాలు ఎలక్ట్రిషన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఆరునెలల కుమార్తె ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: అవినీతిలో ఆసియా కప్పు మనదే!