ETV Bharat / jagte-raho

'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?' - Maruthi rao committed suicide in hyderanad

తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. 2018లో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆయన బస చేసిన గదిలో విషం సేవించిన ఆనవాళ్లు కనిపించాయి. గదిలో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు చరవాణి స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్న పోలీసులు... గదిలో దొరికిన లేఖలో ఉన్న రాత మారుతీరావుదేనా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

why-maruthi-rao-committed-suicide
why-maruthi-rao-committed-suicide
author img

By

Published : Mar 9, 2020, 11:36 AM IST

'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సుపారీ గ్యాంగ్​తో అల్లుడిని హత్య చేయించిన మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ నుంచి ఖైరతాబాద్​లోని ఆర్యవైశ్య భవన్​కు చేరుకున్న మారుతీరావు.... 306 నెంబర్ గదిని అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో డ్రైవర్​తో కలిసి బయటికి వెళ్లిన ఆయన అల్పాహారం తీసుకొని 9 గంటల ప్రాంతంలో గదికి వచ్చాడు. 9.30 గంటలకు డ్రైవర్​కు ఫోన్ చేసి కారులో ఉన్న కొన్ని పత్రాలు తీసుకురావాలని సూచించాడు. పత్రాలు తీసుకొని గదికి వెళ్లిన డ్రైవర్ వాటిని మారుతీరావుకు ఇచ్చేశాడు.

ఫోన్ స్పిచ్ఛాఫ్ వస్తోంది.. పైకెళ్లి చూడు

గదిలో పడుకుంటానని డ్రైవర్ శివ.. మారుతీరావును కోరగా... కారులోనే పడుకోవాలని సూచించాడు. ఉదయం 8 గంటల కల్లా బయటికి వెళ్లాల్సి ఉంటుందని సిద్ధంగా ఉండాలని డ్రైవర్​కు చెప్పాడు. ఉదయం 7.30 ప్రాంతంలో డ్రైవర్ బయటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అంతలోపే మారుతీరావు భార్య గిరిజ... డ్రైవర్ శివకు ఫోన్ చేశారు. మారుతీరావు ఫోన్ చాలాసేపటి నుంచి స్విచ్ఛాఫ్ వస్తోందని... పైకెళ్లి చూడాలని గిరిజ... డ్రైవర్​కు సూచించింది. డ్రైవర్ పైకెళ్లి గది తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. బయట ఉండి అరగంట పాటు.. తలుపులు తట్టాడు.

లోపల స్నానం చేస్తుంటాడని భావించిన డ్రైవర్.. ఆ తర్వాత అనుమానం వచ్చి... ఆర్యవైశ్య భవన్ సిబ్బందికి తెలిపాడు. మేనేజర్ మల్లికార్జున్ సాయంతో తలుపులు తోసేసి... లోపలికి వెళ్లిన డ్రైవర్... మారుతీరావు పరుపుపై పడిపోయి ఉండటాన్ని గమనించాడు. మేనేజర్ వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారమిచ్చాడు.

అమృత అమ్మ దగ్గరకు రా..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.... వాష్​బేసిన్​తో పాటు పరుపుపై వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న మారుతీరావును వెంటనే అంబులెన్స్​లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గదిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిరిజా క్షమించు... అమృతా... అమ్మ దగ్గరకు రా అని లేఖలో రాసి ఉంది.

సుఫారీ గ్యాంగ్​తో ప్రణయ్ హత్య..

మారుతీరావు కూతురు అమృత.. కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబం పరువు తీసిందని అవమానంగా భావించిన మారుతీరావు... సుఫారీ ముఠాతో అల్లుడిని హత్య చేయించాడు. 2018 సెప్టెంబర్​లో జరిగిన ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మారుతీరావుతో పాటు.. మరో ఏడుగురు జైలుకు వెళ్లి వచ్చారు.

సయోధ్య కోసం యత్నం..

బెయిల్​పై బయటికి వచ్చిన తర్వాత కూడా మారుతీరావు... కూతురితో సయోధ్య కోసం ప్రయత్నించాడు. కేసులో రాజీపడితే... ఆస్తి మొత్తం తన పేరుమీదే రాస్తానని మధ్యవర్తుల ద్వారా చెప్పి పంపాడు. అమృత మరోసారి తండ్రి మారుతీరావు బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా... పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. బెయిల్​పై మారుతీరావు బయటికి వచ్చాడు.

కూతురు కనికరించకపోవడం, విభేదాలు..

ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన విచారణ నల్గొండ న్యాయస్థానంలో ప్రారంభమైంది. మారుతీరావు ఆందోళనకు గురయ్యాడు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరుడు శ్రవణ్​తోనూ వివాదాలున్నట్లు వార్తలొచ్చాయి. ఓ వైపు హత్య కేసు... అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుతో గొడవ మరోవైపు... సోదరుడితో ఆస్తి వివాదాలతో... మారుతీరావు కుంగిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నివేదిక వచ్చిన తర్వాతే..

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... మారుతీరావు చరవాణిని విశ్లేషిస్తున్నారు. గదిలో పరుపుపై చేసుకున్న వాంతుల అవశేషాలతో పాటు లేఖను ఎఫ్ఎస్ఎల్​కు పంపారు. మారుతీరావు డ్రైవర్​ను ప్రశ్నించనున్నారు. పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత మృతికి సంబంధించి పోలీసులు తుది నిర్ధరణకు రానున్నారు.

ఇవీ చూడండి: పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారేమో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.