జాతీయ స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది.. తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లాలోని బావిలో మృతదేహాల కేసు. ఇందులో ప్రధాన నిందితుడైన సంజయ్ కుమార్ యాదవ్ నేర చరిత్ర.. ఆంధ్రప్రదేశ్ తోనూ ముడిపడి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం వద్ద యువతి హత్య కేసులోనూ.. సంజయ్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే పోలీసులకు వరంగల్ పోలీసులు సమాచారం అందించారు. మార్చి 8న చోటీ అనే యువతిని హైదరాబాద్ నుంచి రైలులో సంజయ్ తీసుకొచ్చాడు.
పశ్చిమ గోదావరిజిల్లా చాగల్లు మండలం బ్రహ్మణ గూడెం సమీపానికి వచ్చాక చున్నితో గొంతు బిగించి.. రైలు నుంచి తోసేశాడు. నిడదవోలు రైల్వే పోలీసులు ఆ యువతిది అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసులు అందించిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గురైన చోటీ అనే యువతి వివరాలు ఆరా తీయడం వల్లే.. సంజయ్ హత్య ఇంతటి పని చేసినట్టుగా అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: