ETV Bharat / jagte-raho

కరోనాపై వదంతులు సృష్టించాడు.. కటకటాలపాలయ్యాడు - visakhapatnam latest crime news

కరోనా వైరస్ పట్ల సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్న వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం నిందితుడిని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. కరోనాపై అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కరోనాపై సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం... వ్యక్తి అరెస్ట్​

author img

By

Published : Apr 12, 2020, 9:51 AM IST

కరోనా వైరస్ పట్ల సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తోన్న వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. మద్దిలపాలెంలో రబ్బానీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం నిర్వాహకునికి కరోనా వ్యాధి సోకిందని.. అతని వద్ద ఎవరూ పాలు కొనుగోలు చెయ్యొద్దని ఓ వ్యక్తి సోషల్​ మీడియాలో ప్రచారం చేశాడు. విక్రయ కేంద్రం నిర్వాహకుడు ఇటీవల నిజాముద్దీన్ వెళ్లి వచ్చాడని.. అతనికి కరోనా సోకిందని వీడియో ద్వారా వదంతులు రేగటంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ వార్త అవాస్తవమని గుర్తించిన పోలీసులు... వీడియో సందేశంతో వదంతులు సృష్టించిన పోతురాజు శ్రీనివాసరావును అరెస్ట్​ చేశారు. అనంతరం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారు. కరోనాపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్​ క్రైం సీఐ గోపీనాథ్​ హెచ్చరించారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

కరోనాపై సోషల్‌ ‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.