ఇదీ చూడండి:
బుర్ఖాలో వచ్చారు.. యువతిని అపహరించారు - latest crime news in kadapa dst
ఇంట్లో ఉన్న యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బుర్ఖా ధరించి అపహరించిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. వైవీ స్ట్రీట్కు చెందిన 21 ఏళ్ల యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి ఆమెను కిడ్నాప్ చేశారు. గమనించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. యువతిని కిడ్నాప్ చేశారా.. లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.
యువతిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు