ఉభయగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు. పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన సావళ్ల కృష్ణ, కోసూరు పోతురాజులు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు.
పెనుమంట్ర మండలం మార్టేరు కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన సావళ్ల కృష్ణ, కోసూరు పోతురాజులుగా గుర్తించారు. ఉభయ గోదావరిలో 18 నేరాలు చేసినట్లు విచారణలో అంగీకరించారని.. నిందితుల నుంచి 171 గ్రాముల బంగారు ఆభరణాలు, 735 గ్రాముల వెండి వస్తువులు, 8 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్ కుమార్ వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.