కడప జిల్లా కొండాపురం మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ గత కొంతకాలంగా ఎర్రగుంట్లలో నివాసముంటున్నారు. బ్యాంకులో పని ఉండటం వల్ల తాళ్ల పొద్దుటూరుకు కుమారుడు నాగవర్ధన్ కలిసి ద్విచక్ర వాహనంలో తల్లి ఈశ్వరమ్మ బయలుదేరింది.
ఆస్పత్రికి తరలించేందుకు..
కొండాపురం మండలం చౌటిపల్లి పునరావాస కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో కుమారుడు నాగ వర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ఈశ్వరమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా అదే దారిలో వెళ్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు.
మార్గమధ్యలోనే..
అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఈశ్వరమ్మ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవ పరీక్షల కోసం తల్లి కుమారుడి మృత దేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు కొండాపురం పోలీసులు పేర్కొన్నారు.