కడప జిల్లా ఖాజీపేట మండలం రావులపల్లె చెరువు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. చెన్నూరు పెన్నా నది నుంచి ఖాజీపేట వైపునకు ఇసుకతో వస్తున్న ఎడ్ల బండిని వెనుకనే వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు మృతి చెందాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరితోపాటు బండిలో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఇదీ చదవండి: