ETV Bharat / jagte-raho

ఆదిలాబాద్​ కాల్పులు: మరో ఇద్దరిపై హత్యానేరం కేసు - adilabad gun fire case

తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారూఖ్​ అహ్మద్​ కాల్పుల ఘటనలో మరో ఇద్దరిపై హత్యానేరం కింద కేసునమోదు చేశారు. ఫారూఖ్‌ తనయుడిని నిజామాబాద్‌లోని జువైనల్‌ హోంకు తరలించారు. అతని సమీప బంధువు అఫ్రోజ్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు.

adilabad gun fire case
ఆదిలాబాద్​ కాల్పులు: మరో ఇద్దరిపై హత్యానేరం కేసు
author img

By

Published : Jan 4, 2021, 9:38 PM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్‌ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌ కాల్పుల ఘటనలో మరో ఇద్దరిపై కేసునమోదైంది. రెండో పట్టణ పోలీస్​ స్టేషన్‌లో 302 సెక్షన్‌ హత్యానేరం కింద నమోదుచేశారు.

తాజాగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న ఫారూఖ్‌ తనయుడు సహా సమీప బంధువు అఫ్రోజ్‌పై కేసునమోదు చేసి అరెస్ట్​ చేశారు. ఫారూఖ్‌ తనయుడిని నిజామాబాద్‌లోని జువైనల్‌ హోంకు తరలించారు. అఫ్రోజ్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు. డిసెంబర్‌ 18న ఆదిలాబాద్‌లోని తాటిగూడలో ఫారూఖ్‌ కాల్పులు జరపగా.. సయ్యద్‌ జమీర్‌ మృతిచెందారు.

ఇవీచూడండి:

రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.