తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గణపతిగూడెంలో ఇటీవల మల్లమ్మ అనే మహిళ.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె మృతదేహాన్ని శవపేటికలో పెట్టి కుటుంబసభ్యులు ఖననం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని బయటకు తీసి గుండు గీశారు. మూడో రోజు కార్యక్రమం చేద్దామని కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వెళ్లగా... మృతదేహం ఉన్నచోట తవ్వినట్లు కనిపించింది. తల్లి శవాన్ని ఎవరైనా తీశారా.. అన్న సందేహంతో కుమారుడు రాజు.. శవపేటిక తెరచి చూడగా... ఆమె తలకు గుండు గీసి ఉంది. ఈ ఘటనపై రాజు పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి: