ETV Bharat / jagte-raho

శంషాబాద్​ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు

తెలంగాణలో యువ పశువైద్యురాలి అదృశ్యంపై ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది.

శంషాబాద్​ ఘటనపై నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు

author img

By

Published : Nov 30, 2019, 11:41 PM IST

తెలంగాణలోని శంషాబాద్‌ గ్రామీణ పోలీస్ స్టేషన్​ ఎస్సై రవికుమార్‌, ఎయిర్‌పోర్టు పీఎస్‌కు చెందిన ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌లను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ముగ్గరు సిబ్బందిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని సీపీ తెలిపారు. ఫిర్యాదు అందితే అధికార పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే...
గురువారం రాత్రి శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తప్పిపోయిన యువతికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఆలస్యం కావడంపై పోలీస్​ శాఖ విచారణ జరిపింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.