ETV Bharat / jagte-raho

దారుణం: బాలికపై ఏడాదిగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం - visakha district crime news

బాలికపై ముగ్గురు వ్యక్తులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో చోటుచేసుకుంది.

Three men rape minor girl in yelamanchili
మైనర్ బాలిక పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం
author img

By

Published : Jul 6, 2020, 12:08 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో... బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో.. ఎలమంచిలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే..

కొత్తలి గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి బాలిక నాయనమ్మ, తాతయ్యల వద్ద ఉంటుంది. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న బాలిక రెండేళ్ల కిందట చదువు మానేసింది. అప్పట్నుంచి ఇంటి వద్ద ఉంటుంది. నాయనమ్మ, తాతయ్యలు వ్యవసాయ కూలీల కావడంతో... ఉదయాన్నే పొలం పనులకు వెళ్లి తిరిగి రాత్రికి వస్తారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు వ్యక్తులు... ఒంటరిగా ఉన్న బాలికను ఏడాదిగా బెదిరిస్తూ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇటీవల బాలిక పొట్ట ఎత్తుగా రావడంతో గమించిన నాయనమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతిగా నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి తరలించారు. నిందితుల్లో ఒకరు పెయింటర్​, మరొకరు వ్యవసాయ కూలీ, మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ.. మనస్తాపంతో వివాహిత బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.