పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో పాత తగాదాలు భగ్గుమన్నాయి. మోర్త గ్రామంలోని గీతా మందిర్ వీధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఖురేషీ అబ్దుల్ రెహమాన్, జై సింగ్, సంజయ్ సింగ్ ఉపాధి నిమిత్తం అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. జై సింగ్ సంజయ్ సింగ్‌ల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తుతున్నాయి.
పాత కక్షల వల్ల..
పాత తగాదాల నేపథ్యంలో సంజయ్ సింగ్, జై సింగ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. డయల్ 100కి అందిన సమాచారం ద్వారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాల పాలైన జై సింగ్‌ను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించే ఏర్పాట్లు చేశారు. అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆటోలో బాధితుడ్ని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు ఆస్పత్రికి..
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖురేషీ అబ్దుల్ రహమాన్ ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: