ETV Bharat / jagte-raho

బైక్ కొనివ్వలేదని... బలవన్మరణం - kadapa harikrishna latest News

తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్ కొనివ్వలేదని కుమారుడి బలవన్మరణం
బైక్ కొనివ్వలేదని కుమారుడి బలవన్మరణం
author img

By

Published : Oct 11, 2020, 10:54 PM IST

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం స్వామినగర్​కు చెందిన బి.నెట్టికంటి, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా హరికృష్ణ 19 ఏళ్ల యువకుడు. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హరికృష్ణ కూడా కూలీ పనులకు వెళ్లేవాడు.

డబ్బులు కావాలి..

ఈ నేపథ్యంలో హరికృష్ణ తనకు నచ్చిన ద్విచక్రవాహనాన్ని ఎంపిక చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చి బైక్ కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తమ వద్ద డబ్బులు లేవని బదులిచ్చిన తల్లిదండ్రులు.. కూలీ డబ్బులు పోగేసుకుని వాహనం కొనుగోలు చేసుకోమని కుమారుడికి సూచించారు.

మనస్థాపం చెందిన హరికృష్ణ కడప రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.