ETV Bharat / jagte-raho

విధి కూడా... పైశాచికుల పంచన చేరిందా...? - LATEST RAPE CASES IN TELANGANA

హైదరాబాద్​లో... సంచలనం రేపిన వైద్యురాలి హత్యకేసులో మృతురాలిని దురదృష్టం రెండు సార్లు వెంటాడింది. ఆరాంఘర్​లో లారీ అన్​లోడ్ చేయాల్సిన బిల్డర్ నిందితుల ఫోన్ ఎత్తి ఉంటే రాత్రే వెళ్ళిపోయేవాళ్లు. ద్విచక్రవాహనం టోల్​గేట్ వద్ద పార్క్ చేయొద్దని సిబ్బంది చెప్పినప్పుడు యువతి వెళ్లిపోవాల్సింది. ఈ రెండూ కాకుండా తన చెల్లి చెప్పినట్లు భయం వేసినప్పుడు టోల్​బూత్​ దగ్గరకు వెళ్లి సిబ్బంది సాయం కోరినా పరిస్థితి ఇంకోలా ఉండేదేమో...!!! యువతి బయలుదేరినప్పటి నుంచి ఎదురైన కర్కష గడియలు తనకు వ్యతిరేకంగా మారాయి.

విధి కూడా... పైశాచికుల పంచన చేరిందా...?
విధి కూడా... పైశాచికుల పంచన చేరిందా...?
author img

By

Published : Nov 30, 2019, 7:52 AM IST

Updated : Nov 30, 2019, 9:30 AM IST

"పిల్ల అందంగా ఉంది... ఈ అవకాశాన్ని వదులు కోకూడదు... తాను ప్రతిఘటిస్తే ఏం చేయాలి... ఎలా అనుభవించాలి" మద్యం సేవిస్తూ... నిందితుడు ఆరిఫ్​ తన స్నేహితులతో చేసిన వ్యాఖ్యలివి. శంషాబాద్​ టోల్​గేట్​ వద్ద జరిగిన దారుణంలో నిందితులు పైశాచికంగా... యువతిని హతమార్చారు.

నాటకమాడి... నాశనం చేశారు...

టోల్ గేట్ వద్ద స్కూటీని యువతి పార్క్ చేయడాన్ని నిందితులు గమనించారు. రాత్రి తిరిగి స్కూటీ కోసం వస్తుందని వేచి చూశారు. స్కూటీ టైరులోని గాలి తీసేశారు. యువతి తిరిగిరాగానే సాయం చేస్తున్నట్లు నమ్మబలికారు. టైరు పంచరైందని నాటకం ఆడి చివరికి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ నలుగురు పైశాచికులు. తొండుపల్లి ఓఆర్ జంక్షన్ నుంచి మృతదేహాన్ని కాల్చిన ఘటనా స్థలికి మధ్య దూరం 28.37 కిలోమీటర్లు, జాతీయ రహదారి కావటం వల్ల మహా అయితే ఆ దూరాన్ని చేరుకునేందుకు సుమారు అర్ధగంట పడుతుంది. పెట్రోల్ కోసం నిందితులు వెళితే... ఇంకో అరగంట పట్టినా.. రాత్రి 10.33 గంటలకు బయలుదేరిన లారీ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా షాద్​గర్ సమీపంలోని చటాన్​ప​ల్లికి చేరుకోవాలి. కానీ.. తెల్లవారుజామున 2 నుంచి 2.30 గంటల మధ్య చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిందితులు ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది.

సీసీటీవీ దృశ్యాలే పట్టించాయి...

ఈ నెల 27న రాత్రి శంషాబాద్ పోలీసులకు యువతి అదృశ్యంపై ఫిర్యాదు అందింది. 28న ఉదయం 7.30 గంటలకు షాద్​గర్ సమీపంలోని చటాన్​పల్లిలో ఓ మృతదేహం దహనం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని సీపీ సజ్జానార్ వివరించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతురాలి తండ్రి , సోదరి ఘటనాస్థలానికి వచ్చి యువతిని గుర్తుపట్టారు. పది బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా... లారీతో పాటు నిందితుల్ని పట్టుకున్నారు.

గడియగడియ గండమాయే....

  1. సాయంత్రం 5 . 30 గంటలకు శంషాబాద్​ నక్షత్రకాలనీ నుంచి యువతి బయలు దేరింది.
  2. 6:08 గంటలకు టోల్‌గేట్ వద్దకు చేరుకుంది.
  3. 6:12 కు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో బైక్​ పెట్టింది.
  4. 6 :13 గచ్చిబౌలికి బయలుదేరి వెళ్ళింది.
  5. 9.13కు తిరిగి తొండుపల్లి ప్లాజాకు చేరుకుంది.
  6. 9.19 గంటలకు సోదరికి ఫోన్ చేసింది.
  7. 9.23కు పంక్చర్ వేయిస్తానని నిందితుడు శివ వాహనం తీసుకెళ్ళాడు
  8. 9.28కు పంక్చర్ షాప్ తీసిలేదని తిరిగి వచ్చాడు.
  9. 9.30కు మళ్లీ పంక్చర్ వేయిస్తానని తీసుకెళ్లాడు.
  10. 9.35కు ద్విచక్రవాహనంతో తిరిగి వచ్చాడు.
  11. 9:44కు యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది .
  12. 10:28కు ద్విచక్రవాహనం ఘటనాస్థలం నుంచి బయల్దేరింది.
  13. అప్పటికే యువతి చనిపోయింది. మృతదేహాన్ని రగ్గులో చుట్టుకుని తీసుకెళ్లారు.

పూర్తిగా కాలిపోయాకే వెళ్లారు...

తొలుత ఎస్సార్ పెట్రోల్ బంకు వద్ద బాటిల్​లో పెట్రోల్ పోయించుకునేందుకు నిందితులు వెళ్లారు. ద్విచక్రవాహనం ఎక్కడుందంటూ నిర్వాహకులు ప్రశ్నించేసరికి.... అక్కడి నుంచి వచ్చేశారు. సమీపంలోని ఇండియన్ ఆయిల్​ బంక్​లో పెట్రోల్ పోయించుకుని వచ్చి షాద్​నగర్ శివారు చటాన్​పల్లి వంతెన వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతదేహం కాలిందా... లేదా అని కాసేపటి తర్వాత వచ్చి పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిందని నిర్ధరించుకున్నాకే తిరుగు పయనమయ్యారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యలో స్కూటీని వదిలేసి నలుగురూ కలిసి లారీలో బయలేరారు. గురువారం ఉదయం ఆరాంఘర్​కు చేరుకున్నారు.

అలసత్వం వహించింది నిజమైతే చర్యలు...

ఘటన జరిగిన రోజు ఫిర్యాదు చేయడానికి వస్తే అలసత్వం వ్యవహరించారని... మృతురాలు గురించి చెడుగా మాట్లాడారంటూ వస్తున్న ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పందించారు. 11.40కు శంషాబాద్ ఆర్టీఏఐ ఠాణాలో ఫిర్యాదు అందిందని... అక్కడి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి తొండుపల్లి జంక్షన్ వరకు వెళ్లి పరిశీలించారన్నారు. 12 నుంచి 12.30 వరకు సీసీ ఫుటేజీని పరిశీలించినట్లుగా వివరించారు. రాత్రి 1:15 గంటలకు టోల్‌గేటు క్యాబిన్ ఇంఛార్జీని విచారించగా... మృతురాలు అక్కడికి బండి పెట్టేందుకు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. 1.25 గంటలకు తల్లిదండ్రులు ఠాణాకు రాగా... వెంట పెట్టుకుని టోల్‌ప్లాజాకు వెళ్లి... తెల్లవారుజామున 5.30 వరకు వెతికినట్లు చెప్పారు. తెల్లవారుజామున 3:10 సమయంలో ఏఆర్ రిజిస్టర్ చేశామని సీపీ తెలిపారు. బాధితులు ఎవరైనా ఆపదలో వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సజ్జనార్​ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా జరగకూడదని... నిందితులకు కఠిన శిక్ష విధించాలని మృతురాలి సోదరి డిమాండ్ చేసింది.

ఇవీ చూడండి: మార్పు దిశగా ఉన్నత విద్య.. అంప్రెంటిష్​షిప్​ విధానం అమలు

TG_HYD_14_30_PRIYANKA_MURDER_CP_PRESS_MEET_PKG_3181326_3182400 ( )సంచలనం రేపిన వైద్యురాలి హత్యకేసులో మృతురాలిని దురదృష్టం రెండు సార్లు వెంటాడింది. ఆరంఘర్ లో లారి అన్ లోడ్ చేయాల్సి బిల్డర్ ఫోన్ ఎత్తి ఉంటే రాత్రి అన్ లోడ్ చేసి తిరిగి వెళ్ళి పోయేవారు...ద్విచక్ర వాహనాన్ని టోల్ గేట్ వద్ద పార్క్ చేస్తుంటే సిబ్బంది కుదరదు అని చెప్పారు. దీంతో టోల్ గేట్ సమీపంలో ఉన్న లారీ పక్కనే స్కూటిని మృతురాలు నిలిపింది. ఈ రెండు విషయాలు అమెను దారుణ హత్యకు కారణమయ్యాయి. వాయిప్ పిల్ల అందంగా ఉంది...ఈ అవకాశాన్ని వదులు కోకూడదు...తాను ప్రతిఘటిస్తే ఏం చేయాలి..ఎలా అనుభవించాలి అని మద్యం సేవిస్తూ ఆరిఫ్ అతని నలుగురు స్నేహితులతో కలసి పథకం రచించాడు. మృతురాలు టోల్ గేట్ వద్ద స్కూటీని పార్క్ చేయడాన్ని గమినించి నిందితులు...ఎలాగైనా రాత్రి తిరిగి స్కూటి కోసం వస్తుందంటూ వేచి చూశారు. ఆమె ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టైరులో గాలిని తీసేశారు. తెలివిగా సాయం చేస్తున్నట్లుగా నమ్మించారు..టైరు పంచరు అని నాటకం ఆడి చివరికి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అ నలుగురు నిందితులు. తొండుపల్లి ఓఆర్ జంక్షన్ నుంచి మృతదేహాన్ని కాల్చిన ఘటనా స్థలికి మధ్య దూరం 28.37 కిలోమీటర్ల దూరం, జాతీయ రహదారి కావడంతో మహా అయితే ఆ దూరాన్ని చేరుకునేందుకు సుమారు అర్థ గంట పడుతుంది. నిందితులు పెట్రోల్ కోసం ఇంకో అరగంట పట్టినా..రాత్రి 10.33 గంటలకు బయలుదేరిన లారీ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లికి చేరుకోవాలి. కానీ..తెల్లవారుఝామున 2 నుంచి 2.30 గంటల మధ్య చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిందితులు ఏం చేశారన్నదే ఇప్ఫుడు మిస్టరీ గా మారింది. వాయిస్ ఈ నెల 27న రాత్రి శంషాబాద్ పోలీసులకు యువతి అదృశ్యంపై ఫిర్యాదు అందింది. ఆమె అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ 28న ఉదయం 7 . 30 గంటలకు షాద్నగర్ సమీపంలోని చటానపల్లి ఓ మృతదేహం దహనం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని సీపీ సజ్జానార్ వివరించారు. అప్పటికే శంషాబాద్ రాణాలో యువతి ఆదృశ్యం కావడంతో పై కేసు నమోదు కావడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించామని. మృతురాలి తండ్రి , సోదరి ఘటనాస్థలానికి వచ్చి ఆమేనని గుర్తు పట్టారని తెలిపారు. వెంటనే కేసు దర్యాప్తును వేగవంతం చేసి పది బృందాలు తో నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు సీసీటివి వజువల్స్ ఆధారంగా.లారీ ని ట్రేస్ చేసి నిందితుల్ని పట్టుకున్నట్లు వివరించారు. బైట్ సజ్జనార్ సైబరాబాద్ సీపీ సాయంత్రం 5 . 30 గంటలకు ప్రియాంకరెడ్డి శంషాబాద్లోని నక్షత్ర కాలనీలోని తన ఇంటి నుంచి బయల్చేరింది . 6:08 గంటలకు టోల్‌గేట్ వద్దకు వచ్చారు . అక్కడ వాహనం పెట్టరాదని సిబ్బంది చెప్పారు. 6:12కు వాహనం అక్కడి నుంచి తీసుకుని తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలోని లారీ వద్దకు వెళ్ళింది. 6 :13వాహనం ఉంచి గచ్చిబౌలి వెళ్ళింది. 9.13 గచ్చిబౌలి నుంచి తిరిగి తొండుపల్లి ప్లాజాకు చేరుకుంది. వాహనం పంక్చర్ అయ్యిందని తెలుసుకుని 9.19 గంటలకు సోదరి కి ఫోన్ చేశారు . 9.23కు నిందితుడు శివ పంక్చర్ వేయిస్తానని వాహనం తీసుకెళ్ళాడు 9.28కు తిరిగి వాహనంతో పంక్చర్ షాప్ తీసిలేదని తీసుకుని వచ్చాడు . 9.30 మళ్లీ పంక్చర్ వేయిస్తానని తీసుకువెళ్లాడు 9.35కు మరోసారి ద్విచక్రవాహనం తీసుకుని వచ్చాడు 9:44కు ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది . 10:28కు ద్విచక్రవాహనం ఘటనాస్థలం నుంచి బయల్దేరింది అప్పటికే ప్రియాంకరెడ్డి చనిపోయింది, మృతదేహాన్ని రగ్గులో చుట్టుకుని తీసుకెళ్లాడు వాయిస్ తొలుత ఎస్ఆర్ అనే పెట్రోల్ బంకు వద్ద బాటిల్ లో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లారు . ద్విచక్రవాహనం ఎక్కడ ఉందంటూ నిర్వాహకులు ప్రశ్నించేసరికి నిందితులు ఆక్కడి నుంచి వచ్చేశారు . అనంతరం సమీపంలో ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని వచ్చి షాద్నగర్ శివారు చటానపల్లి వంతెన వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగుల పెట్టారు. మృతదేహం గాలిందా . . లేదా . . మృతురాలిని దహనం చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు . మళ్లీ కాసేపటికి తిరిగొచ్చి మృతదేహం పూర్తిగా కాలిందా లేదా అని పరిశీలించుకున్నారు . పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్నాక తిరుగు పయనమయ్యారు . అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యలో స్కూటీని వదిలేసి నలుగురు కలిసి లారీలో బయలేరారు . గురువారం ఉదయం ఆరాంఘరకు చేరుకుని సిఫ్ రావుని వద్దకొచ్చి ఆన్లోడ్ చేసి వెళ్లారని సీపీ వివరించారు బైట్: సజ్జనార్ సైబరాబాద్ సీపీ వాయిస్ ఘటన జరిగిన రోజు ఫిర్యాదు చేయడానికి వస్తే అలసత్వం వ్యవహరించారని...మృతురాలు గురించి చెడుగా మాట్లాడారంటూ వస్తున్న ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పందించారు. 11.40కు శంషాబాద్ ఆర్టీఎఐ రాణాలో ఫిర్యాదు అందిందని...అక్కడి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి తొండుపల్లి ఆంక్షన్ వరకు వెళ్లి పరిశీలించారన్నారు . 12 - 12 . 30 వరకు సీసీ ఫుటేజీని పరిశీలించినట్లుగా వివరించారు . ఎక్కడా ఆచూకీ దొరకలేదన్నారు . అనంతరం రాత్రి 1:15 గంటలకు టోల్‌గేటు క్యాబిన్ ఇన్ఫార్డిని విచారించగా . . మృతురాలు అక్కడికి బండి పెట్టేందుకు వచ్చినట్లు గుర్తించారన్నారు . అయితే . . బండి అక్కడ పెట్టకూడదని అతను చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు పరిశీలించామని , ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదన్నారు . అనంతరం రాత్రి 1 . 25 గంటలకు తల్లిదండ్రులు రాణాకు రావడంతో వారిని వెంట పెట్టుకుని టోల్‌ప్లాజాకు వెళ్లి . . తెల్లవారుజామున 5 . 30 గంటల వరకు అక్కడంతా వెతికినట్లు చెప్పారు. . ఇదే సమయంలో తెల్లవారుజామున రాత్రి 3:10 సమయంలో ఎఆర్ రిజిస్టర్ చేశామన్నారు . బాధితులు ఎవరైనా ఆపదలో వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సజనార్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా జరగకూడదని...నిందితులకు కఠిన శిక్ష విధించాలని మృతురాలి సోదరి డిమాండ్ చేసింది. బైట్ : సజ్జనార్ సైబరాబాద్ సీపీ బైట్: భవ్య, మృతురాలి సోదరి ఎండ్ వాయిస్ మృతురాలు తన సోదరితో మాట్లాడినపుడు ఓ చిన్న పిల్లాడు తన స్కూటీ తీసుకువెళ్ళినట్టుగా తెలిపింది....కానీ నలుగురు నిందితులు 20 ఏళ్ళకు పైబడిన వారే అని చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా కామాంధుల చేతికి చిక్కి యువ వైద్యురాలు దారుణంగా అత్యంత పాశవికంగా హత్య కాబడింది..ఇలాంటి ఘటనలు పునారావృతం కాకండా పోలీసులు మరింత చర్యలు తీసుకోవాల్సన అవసరం ఉంది.
Last Updated : Nov 30, 2019, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.