పన్నులు చెల్లించకుండా కోల్ కతా నుంచి భారీ ఎత్తున తీసుకొస్తున్న రెడీమేడ్ దుస్తులను రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 8 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా దొంగ సరుకు వస్తోందనే సమాచారంతో రెండు రోజులుగా విజయవాడ రైల్వే స్టేషన్లో నిఘా ఉంచిన అధికారులు... సరుకు రాగానే పట్టుకున్నారు.
రెడీ మేడ్ దుస్తులను సీజ్ చేసి తీసుకెళ్లేందుకు రైల్వే సిబ్బంది అంగీకరించకపోవడంతో పార్శిల్ కార్యాలయం పక్కనున్న ప్లాట్‌ఫాంపై ఉంచారు. నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలించాక... సరుకు యజమానులు వస్తేనే పంపిస్తామని రైల్వే అధికారులు చెప్పడంతో వారి కోసం పన్నుల అధికారులు పహారా కాస్తున్నారు.
ఇదీ చదవండి