తెలంగాణ... ఈ ఏడాది మే 20న వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్‌లో స్థిరపడిన మక్సూద్ అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. మక్సూద్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఇద్దరు బిహారీ యువకులూ హత్యకు గురయ్యారు. కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితుడు సంజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు చేసినట్లు పోలీసులు నిరూపించారు. ఘటన జరిగిన నెలరోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఇవీచూడండి: ఎడ్ల బండిని ఢీకొన్న కారు... ఎద్దులు మృతి, నలుగురికి గాయాలు