ఇదీ చదవండి:
ఉప్పలపాడులో ప్రమాదం.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు - latestnews road accident uppalapadu
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గొల్లగూడెం ఉప్పలపాడులో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా బందరుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరంతా బుట్టాయగూడెం మండలం గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తడికలపూడి ఎస్సై వెంకయ్య తెలిపారు.
ఉప్పలపాడులో అదుపుతప్పి వ్యాన్ బోల్తా
ఇదీ చదవండి: